Andhra Pradesh: చిన్న సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారు.. విపక్షాలపై మంత్రి బాలినేని ఫైర్..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) గత రెండేళ్ళుగా ఎక్కడా విద్యుత్ కోతలు(Power Cuts) లేవని, రెండు రోజులుగా కొంత సమస్య నెలకొందని..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) గత రెండేళ్ళుగా ఎక్కడా విద్యుత్ కోతలు(Power Cuts) లేవని, రెండు రోజులుగా కొంత సమస్య నెలకొందని, దీనిపై ప్రతిపక్షాలు(Opposition Parties) రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి(Balineni Srinivas Reddy) అన్నారు. గత ప్రభుత్వ బకాయిల కారణంగా ప్రస్తుతం ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. రెండు మూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి బాలినేని తెలిపారు. మరోవైపు ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. హెచ్ఆర్‌ఏ పై మరో స్లాబ్ వేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐఆర్ 27 శాతం, ఫిట్‌మెంట్ 23 శాతంపై 4 శాతం అదనంగా ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఐఆర్‌ను రికవరీ చేయరని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వంపై 5,600 కోట్ల అదనపు భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు.
తుని ఘటనపై.. ఇదే సమయంలో తుని ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. తుని ఘటనపై నమోదైన కేసులను ఎత్తివేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులను మోసం చేయడంపై ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఆందోళనలు చేశారని అన్నారు. కాపులు చేపట్టిన న్యాయమైన ఆందోళనపై కేసులు పెట్టడం సరైంది కాదన్న ఉద్దేశ్యంతో సీఎం ఆ కేసులు ఎత్తివేశారని పేర్కొన్నారు. కేసులు ఎత్తివేయడంపై కాపు సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాలినేని చెప్పారు.
విద్యుత్ కోతలపై విపక్షాల విమర్శలు.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. గ్రామాల్లో అప్రకటితంగా జగనన్న విద్యుత్ కోతల పథకం అమలవుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు 22మిలియన్ యూనిట్ల లోటుతో నుంచి సర్ ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ సప్లై అందించారని పేర్కొన్నారు. జగన్ మాత్రం 6 సార్లు విద్యుత్ ధరలు పెంచి రూ.30వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని విమర్శించారు. పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వకపోగా మోటర్లకు మీటర్లు పెట్టి వేల కోట్ల భారం వేస్తున్నారని విమర్శించారు. డిస్కమ్ ల పేరుతో రూ.6వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి వాటిని దారి మళ్లించారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. రూ. 3 కన్నా తక్కువగా దొరుకుతున్న విద్యుత్ ను పీపీఏలు రద్దు చేయడం ద్వారా రూ. 17తో కొనడం అవినీతికి ఆస్కారం ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. ఇంకా భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రకాశం జిల్లా రైతాంగానికి ఎన్ఎస్పీ ద్వారా నీరందలేక పంట నాశనం అవడానికి సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరే కారణం అన్నారు.
Also read:
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పదో తరగతి పూర్తి చేసిన వారు కూడా అర్హులు..
Digital TOP 9 NEWS: ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర మంచు | జిల్లా కేంద్రం కోసం బాలకృష్ణ డిమాండ్.. వీడియో