Job Mela: నేడు ఏపీలో మెగా జాబ్‌ మేళా.. 34 కంపెనీలు, 4179 ఖాళీలు.. ఇలా రిజిస్టర్‌ చేసుకొని, ఇంటర్వ్యూకు వెళ్లండి..

Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల వరుసగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ప్రైవేటు కంపెనీలోన్ని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఉన్న నిరుద్యోగులకు అనుకూలంగా స్థానికంగానే ఈ జాబ్‌మేళాలను..

Job Mela: నేడు ఏపీలో మెగా జాబ్‌ మేళా.. 34 కంపెనీలు, 4179 ఖాళీలు.. ఇలా రిజిస్టర్‌ చేసుకొని, ఇంటర్వ్యూకు వెళ్లండి..
Follow us

|

Updated on: Feb 06, 2022 | 7:29 AM

Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల వరుసగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ప్రైవేటు కంపెనీలోన్ని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఉన్న నిరుద్యోగులకు అనుకూలంగా స్థానికంగానే ఈ జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో ఆదివారం (నేడు) మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్‌మేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలు ఇంటర్వ్యులను నిర్వహిస్తున్నాయి.? ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఏయే కంపెనీల్లో ఖాళీలు ఉన్నాయంటే..

* వినూత్న ఫర్టీలైజర్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరులో పని చేయాలి.

* అపోలో ఫార్మసీలో.. ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీస్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.

* టీవీఎస్‌ కంపెనీలో మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికై వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది.

* బ్యాంక్‌ బజార్‌ ఇండియా కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన వారు చెన్నైలో పని చేయాలి.

* గ్రీన్‌టెక్‌లో ట్రైనీ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. కేవలం పురుషులు మాత్రమే అర్హులు. మేనకూరు, నాయిడు పేటలో పని చేయాల్సి ఉంటుంది.

* మీషోలో సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. కేవలం పరుషులు మాత్రమే అర్హులు.

* ఫోన్‌లో బీడీఈ విభాగాలో ఖాళీలు ఉన్నాయి.

* అమర్‌రాజా సంస్థలో మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులక చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.

* ఎయిర్‌టెల్ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే అర్హులు. వీటితో పాటు మరిన్ని కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు అర్హులు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన విషయాలు..

* పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-45 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యుకు హాజరయ్యే ముందు ఈ లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

* పీలేరు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు గ్రామ సచివాలయాల్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

* ఇంటర్వ్యూలను ఎస్‌జీ గవర్నమెంట్‌ డిగ్రీ, పీజీ కాలేజ్‌, పీలేరు, మదనపల్లి రోడ్‌, బొడుమల్లువారిపల్లి, చిత్తూరు అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఫిబ్రవరి 06, 2022 ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి.

* ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు రెజ్యూమ్‌తో పాటు, విద్యార్హతల జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ వెంట తెచ్చుకోవాలి.

* ఇతర వివరాలు, సందేహాల కోసం 8142509017, 9966086996 నంబర్లను సంప్రదించండి.

* రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకునే వారు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Andhra Pradesh: సత్తా లేని నాయకుడు అంటూ.. మాజీ సీఎం సోదరుడిపై ఎంపీ ఫైర్..

Astro Tips: ఈ వాస్తు దోషాలు.. మీలో మానసిక ఆందోళనను, ఒత్తిడిని పెంచుతాయి..!

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..