AP School Syllabus: వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 9, 10వ తరగతుల సిలబస్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొమ్మిది, పదో తరగతితోపాటు దిగువ తరగతుల సిలబస్‌ మారనుంది. ఈ మేరకు 2024-25 విద్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మారనున్నట్లు ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల..

AP School Syllabus: వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 9, 10వ తరగతుల సిలబస్‌
AP School Syllabus
Follow us

|

Updated on: Mar 22, 2023 | 3:20 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొమ్మిది, పదో తరగతితోపాటు దిగువ తరగతుల సిలబస్‌ మారనుంది. ఈ మేరకు 2024-25 విద్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మారనున్నట్లు ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డైరెక్టర్‌ కె రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ తరగతి సిలబస్‌ పూర్తిగా మారనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఉపవాచకాలు ఉంటాయి. అలాగే ఇంగ్లిస్‌ సబ్జెక్టుకు వర్క్‌బుక్‌ వస్తుంది. సాంఘిక శాస్త్రంలో నాలుగు టెక్స్ట్‌ బుక్స్‌, గణితంలో రెండు పుస్తకాలుంటాయని ఆయన అన్నారు. కొత్తగా ముద్రించే టెక్స్ట్‌ బుక్స్‌లో ఓ వైపు ఇంగ్లిష్‌, రెండో వైపు తెలుగు లేదా ఉర్దూ మీడియాల్లో ముద్రించబడి ఉంటాయని తెలిపారు.

ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఇప్పటివరకూ ఉన్న మూడు సెమిస్టర్లను తొలగించి రెండు సెమిస్టర్ల విధానం అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. 6, 7 తరగతుల ఆంగ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ మేరకు ఉంటాయన్నారు. 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మార్పు ఉండదని డైరెక్టర్‌ కె రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.