Andhra News: రూ.500 కోసం హంతకులుగా మారిన మందుబాబులు.. అసలు మ్యాటరేంటంటే?
ఈ ఆధునిక సమాజంలో ఓ మనిషి ప్రాణం విలువ ఐదు వందల నోటు, ఒక సెల్ ఫోన్‌తో సమానం అయిపోయింది. వీటి కోసం ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలనే తీసేశారు. బండరాతితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేమాన్ని బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని తుని పట్టణంలో వెలుగు చూసింది.

ఈ ఆధునిక సమాజంలో ఓ మనిషి ప్రాణం విలువ ఐదు వందల నోటు, ఒక సెల్ ఫోన్‌తో సమానం అయిపోయింది. వీటి కోసం ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలనే తీసేశారు. బండరాతితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేమాన్ని బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని తుని పట్టణంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.30 గంటలకు తుని పట్టణంలో నరిసిపట్నం వెళ్లే బస్ స్టాండ్ లో సురేష్, ప్రసాద్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. వారి వద్దకు అప్పల నాయిడు అనే వ్యక్తి వచ్చాడు. అయితే మద్యం తాగుతున్న వారికి అప్పల నాయుడు చెయ్యి తగిలింది. కోపంతో వారు అతన్ని నెట్టివేశారు. దీంతో అప్పల్ నాయుడు కిందపడిపోయాడు. కిందపడిపోవడంతో అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్, ఐదు వందల నోటు క్రింద పడిపోయాయి. వీటిని చూసిన నిండుతులు సెల్ ఫోన్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు.
దీంతో అప్పల్ నాయుడు నా సెల్ ఫోన్ నాకు ఇవ్వండి అని వారి వెంటపడ్డాడు. కొంతదూరం వెళ్ళాక ఆగిపోయిన నిందితులు అప్పల్ నాయుడిపై తిరగబడ్డారు. అతన్ని బ్రిడ్జి క్రిందకు తోసి ఒక బండ రాయితో మొఖం గుర్తుపట్టలేనివిదంగా కొట్టారు. తన తో తీసుకువొచ్చిన రాడ్ తో మొఖం పై కొట్టి అప్పలనాయుడును హతమార్చారు. సెల్ ఫోన్, ఐదు వందల రూపాయిలు పట్టుకొని ఇద్దరు నిందితులు అక్కడి నుంచి అయ్యారు.
బ్రిడ్జ్ కింద మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులు ఇద్దరని అదుపులోకి తీసుకొన్నారు. మద్యం మత్తులో కేవలం ఒక సెల్ ఫోన్, ఐదు వందల నోటు కొసం ఒక మనిషి ప్రాణాలు తీసి ఇప్పుడు కట కటాలు లెక్కడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




