Viral Video: అందుకే అంటారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.. ఇది చూశాక నిజమని నమ్మాల్సిందే..
సోషల్ మీడియాలో తరచూ వైరల్‌గా మారే కొన్ని సంఘటనలు జనాలను భయాందోళనకు గురిచేస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లారీ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి తప్పించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదట అనే సామెత అందిరికీ తెలిసే ఉంటుంది. సమాజంలో ఎప్పికప్పుడు ఇది నిజమనే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చూసిన తర్వాత నిజంగానే శివయ్య ఆజ్ఞలేనిది చీమైనా కుట్టదని మీరు కచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిపై నుంచి లారీ వెళ్లినా కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఆశ్చర్యకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న నరేందర్ అనే ఒక వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ టర్నింగ్ వద్ద కాంక్రీట్ మిక్సర్ ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో ఆ ట్రక్కు అతని స్కూటీని ఢీకొని అతనిపై నుంచి దూసుకెళ్లింది. కానీ నరేందర్ మాత్రం రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు.
అది గమనించిన ఒక బైకర్ వెంటనే నరేందర్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అతడికి సాయం చేశాడు. అనంతరం ఆతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఈ ప్రమాదంలో నరేందర్ వాహనం దెబ్బతింది. అయితే అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు.
వీడియో చూడండి..
“जाको राखे साइयां मार सके न कोय”
काकीनाडा में बड़ा हादसा…सीमेंट मिक्सिंग ट्रक के नीचे आने के बाद भी चमत्कारिक रूप से बचा बाइकर#AndhraPradesh pic.twitter.com/koFhAa04Af
— Gurutva Rajput 🇮🇳 (@GurutvaR) October 7, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
