Distributors Meeting: మంత్రి పేర్ని నానితో రేపు ఆంధ్రా, సీమ డిస్ట్రిబ్యూటర్ల సమావేశం
Distributors Meeting: జనాలకు సినిమా అంటే వినోదం.. కానీ ఏపీలో ఇప్పుడది వివాదంగా మారిపోయింది. సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండటం....
Distributors Meeting: జనాలకు సినిమా అంటే వినోదం.. కానీ ఏపీలో ఇప్పుడది వివాదంగా మారిపోయింది. సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది. టికెట్ల ధరల అంశంపై రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది. ఈ సినిమా టికెట్ల పెంపు వ్యవహారంపై డిస్ట్రి బ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో ఆంధ్రా, సీమ డిస్ట్రిబ్యూటర్ల భేటీ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 20 మందితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో టికెట్ల ధరలు తగ్గింపు, థియేటర్లలో తనిఖీలతో డిస్ట్రీబ్యూటర్లు ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం చెప్పిన ధరలకు థియేటర్లు నడపలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. థియేటర్లలో తనిఖీలు, స్వచ్ఛంధంగా మూతపైనే ప్రధాన చర్చ జరగనుంది.
అయితే టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్న ఇండస్ట్రి పెద్దలకు భేటీ ఖరారైంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. అయితే టికెట్ ధరలు తక్కువగా ఉంటే సినిమా థియేటర్లను నడపలేమని సిని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నానితో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి చర్చించనున్నారు. సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: