AP High Court: ఏపీ సర్కార్‌కు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ.. జీవో 53, 54లు కొట్టివేత..
AP High Court: ఏపీ సర్కార్ కు మరోసారి హై కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ...
AP High Court: ఏపీ సర్కార్ కు మరోసారి హై కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ.. జీవో 53, 54లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ.. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం హైకోర్టుని ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలని వ్యతిరేకిస్తూ.. ప్రైవేట్ విద్యా సంస్థలు హైకోర్టు లో పిటిషన్ ను దాఖలు చేశాయి.
ఈరోజు ఈ పిటిషన్ ను విచారణ చీపుట్టిన హైకోర్టు.. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారంటూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది.
అంతేకాదు ప్రభుత్వానికి కొన్ని సూచనలను కూడా చేసింది.. రాష్ట్రంలోపని ప్రైవేట్ స్కూలు, జూనియర్ కాలేజీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఫీజులను ఖరారు చేయాలనీ సూచించింది.
Also Read: ఇక నుంచి ఆ దేశంలో స్థానికులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పసరి..