AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Marriage Act: ఇక నుంచి ఆ దేశంలో స్థానికులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పసరి..

Sri lanka new marriage act: శ్రీలంక దేశంలో సరికొత్త వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి విదేశీయులు ఎవరైనా స్థానికులను వివాహం చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతిని..

New Marriage Act: ఇక నుంచి ఆ దేశంలో స్థానికులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పసరి..
Sri Lanka New Marriage Act
Surya Kala
|

Updated on: Dec 27, 2021 | 3:55 PM

Share

Sri Lanka New Marriage Act: శ్రీలంక దేశంలో సరికొత్త వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి విదేశీయులు ఎవరైనా స్థానికులను వివాహం చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతిని తప్పని చేసింది. తమ దేశ జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందిన తర్వాతనే స్థానిక వ్యక్తులను వివాహం చేసుకోవాలనుకునే నిబంధనను శ్రీలంక ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు,  అనేక పౌర సంఘాలు వ్యతిరేకించాయి. శ్రీలంలో సరికొత్త వివాహ చట్టం జనవరి 1, 2022 నుండి అమలులోకి రానున్నది. జాతీయ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్టోబర్ 18న విడుదల చేసిన సర్క్యులర్‌లో రిజిస్ట్రార్ జనరల్ డబ్ల్యూఎంఎంబీ వీర్ సేకేరా తెలిపారు.

“విదేశీయులు, శ్రీలంకవాసుల మధ్య జరిగే వివాహాల వల్ల తలెత్తే జాతీయ భద్రత సమస్యల” గురించి చర్చించారు. విదేశీయులు ఇక నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆఫ్ సెక్యూరిటీ’ పొందిన తర్వాతే అదనపు జిల్లా రిజిస్ట్రార్ (శ్రీలంక కొత్త వివాహ చట్టం) ద్వారా వివాహాలను నమోదు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అయితే ఇది వివక్షత కిందకు వస్తుందని ప్రతిపక్ష ఎంపీ హర్ష డి సిల్వా విమర్శించారు.

ప్రభుత్వ చర్యపై తలెత్తుతున్న ప్రశ్నలు: 

పౌర సంస్థలతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రభుత్వం తీసుకున్న చర్యపై ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అయితే పెళ్ళికి ముందు (శ్రీలంక కొత్త వివాహ చట్టం.. విదేశియుడి గత ప్రవర్తనని పరిశిలిస్తుందని.. గత ఆరు నెలల్లో విదేశీయుడు ఎలాంటి నేరానికి పాల్పడలేదని గుర్తించి.. సెక్యూరిటీ నో-అబ్జెక్షన్ లెటర్ సర్టిఫై చేస్తుందని పేర్కొంది. దీంతో విదేశీయులను చేసుకున్న వివాహాల ద్వారా స్థానిక ప్రజలు మోసపోకుండా నిరోధించడానికి ఈ చట్టం సహాయపడుతుందని చెప్పారు. అంతేకాదు ఈ వివాహ చట్టం ద్వారా.. దేశంలో వివాహాల ద్వారా పెరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టవచ్చునని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

చర్చిల్లో జరిగే వివాహాలకు కూడా ఇదే చట్టం వర్తిస్తుంది: 

భద్రతా క్లియరెన్స్ నివేదిక ఇచ్చిన తర్వాత.. మాత్రమే అదనపు జిల్లా రిజిస్ట్రార్‌ వివాహాన్ని నమోదు చేయడానికి వీలుంటుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండా చర్చిల్లో కూడా ఇకపై స్వదేశానికి చెందిన పౌరుడిని విదేశీయులు వివాహం చేసుకోలేరు.

Also Read:  ఈరోజు సాయంత్రం చెన్నైలో RRR ఈవెంట్.. మొదలైన తమిళ తంబీల సందడి.. హోస్ట్‌గా తమిళ హీరో..