AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి ఆదిమూలపు కుమార్తె వివాహ రిసెప్షన్‌‌లో సీఎం జగన్.. ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యటన

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌ ప్రకాశం జిల్లాలో సోమవారంనాడు సుడి గాలి పర్యటన చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్తే పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లి.. వధూవరులను ఆశీర్వదించారు.

మంత్రి ఆదిమూలపు కుమార్తె వివాహ రిసెప్షన్‌‌లో సీఎం జగన్.. ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యటన
Ys Jagan
Janardhan Veluru
|

Updated on: Dec 27, 2021 | 3:53 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యట చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్తే వివాహం ఈ మధ్యనే జరిగింది. ఆ వివాహ రిసెప్షన్‌ను ఒంగోలు సమీపంలోని యర్రగొండపాలెంలో నిర్వహించారు. ఈ వింధుకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరై.. నవ వధూవరులను ఆశీర్వదించారు.  తాడేపల్లి నుంచి వచ్చిన సీఎం.. నేరుగా హెలిప్యాడ్‌ నుంచి ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. స్టేజీ మీదకు వెళ్లిన జగన్‌.. నూతన వధూవరులు శ్రిష్టి, సిద్ధార్థ్‌లకు పూల బోకేలిచ్చి ఆశీర్వదించారు. సీఎం ఫంక్షన్‌ హాల్‌లో కొద్ది సమయమే ఉన్నా.. ఎవరిని కలుసుకోలేదు. సీఎం వెంట మంత్రులు బాలినేని శ్రీనివాస్‌, నారాయణ స్వామి, ఎంపీ మాగుంట పాల్గొన్నారు. అయితే.. సీఎం వస్తున్నారన్న సమాచారంతో కార్యకర్తలు, అభిమానులు ఫంక్షన్‌ హాల్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఫంక్షన్‌ హాల్‌లో ఉన్న కార్యకర్తలకు సీఎం.. స్టేజీ మీదనుంచే అభివాదం చేశారు. ఆ వెంటనే స్టేజీ దిగి వెళ్లిపోయిన జగన్‌.. వ్యవసాయమార్కెట్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకొని తుళ్లూరకు వెళ్లిపోయారు.

అంతకు ముందు హెలిక్యాప్టర్‌లో వచ్చిన సీఎంకు మంత్రులు ఆదిమూలకు సురేష్‌ కుమార్‌, జిల్లా MLAలు, పార్టీ నేతలు, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, SP మల్లిక గార్గ్‌ స్వాగతం పలికారు. అయితే.. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ ఆదేశాల మేరకు ముందస్తుగా తయారు చేసుకున్న రూట్‌ మ్యాప్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఫంక్షన్‌ హాల్‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ముందస్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉండే విధంగా చూసుకున్నారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో సీఎం జగన్…

Also Read…

Sri Lanka: ఇక నుంచి ఆ దేశంలో స్థానికులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పసరి..

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నాగశౌర్య.. ఆ కీలకపాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..