Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు నిరాశ.. ఓటీటీలోకి రాధేశ్యామ్ ?..

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు నిరాశ.. ఓటీటీలోకి రాధేశ్యామ్ ?..
Radheshyam

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు ప్రభాస్. ఈ మూవీతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా

Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Dec 27, 2021 | 6:59 PM

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు ప్రభాస్. ఈ మూవీతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. డార్లింగ్‏తో సినిమా చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. మరోవైపు.. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ప్రస్తుత పరిస్థితులలో థియేటర్ల కంటే ఓటీటీలో విడుదల చేయడమే బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దేశంలో ఓమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ విషయంలో థియేటర్స్ యాజమానులుకు.. ప్రభుత్వాలకు మధ్య రగడ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలని సూచిస్తున్నారు.

Also Read: RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..

Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu