Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
'అఖండ' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఊపును తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.
‘అఖండ’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఊపును తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హీరో బాలకృష్ణతో పాటు చిత్రబృందం సోమవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ఆయన వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మాట్లాడిన బాలయ్య .. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవ ప్రశంసనీయమన్నారు. భక్తులు కూడా ఆలయ విశిష్టతను, స్వచ్ఛతను సంరక్షించాలని కోరారు.
‘ అఖండ’ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నాం అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చాం. నా ఇష్ట దైవం లక్ష్మీనరసింహస్వామి. నాపై స్వామివారి అనుగ్రహం ఉంది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోంది. ఈ ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిసరాలను కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామివారిని కోరుకున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఈ సందర్భంగా బాలయ్య పేర్కొన్నారు.
Mrs.India: మిసెస్ ఇండియా కిరీటం గెల్చుకున్న విజయవాడ ముద్దుగుమ్మ..