AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: అందుకోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.. నెట్టింట్లో వైరల్‌గా మారిన మంచులక్ష్మి ట్వీట్‌..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Manchu Lakshmi: అందుకోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.. నెట్టింట్లో వైరల్‌గా మారిన మంచులక్ష్మి ట్వీట్‌..
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2021 | 7:06 PM

Share

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా, నిర్మాతగా, టీవీ షోస్‌ హోస్ట్‌.. ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తోంది. వీటి విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు విమర్శలు, ట్రోలింగ్‌ ఎదురైనా అనుకున్న దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగుతుంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి వేళ్లకి, మోకాలికి గాయలైన వీడియోలను పోస్ట్‌ చేసి అభిమానులకు షాకిచ్చిన ఈ తార తాజాగా మరొక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టింది. అందులో ‘కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది’ అని రాసుకొచ్చిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

ఆ డబ్బులకు న్యాయం చేసేందుకు.. ఇన్నాళ్లు ఇంట్లోనే గడిపిన మంచు లక్ష్మి ఇప్పుడు ఫారిన్‌ టూర్‌కు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘ ఇన్ని రోజులు కుటుంబంతో సరదాగా గడిపాను. ఇప్పుడు నా కోసం కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నాను. అందుకే ఒంటరిగా ఫారిన్‌ టూర్‌కు వెళుతున్నాను’ అని ట్వీట్‌ చేసిన ఆమె మరో ట్వీట్‌లో ‘ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్‌ కొనుగోలు చేయడానికి నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్‌ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా’ అని  విమాన టికెట్ల ధరలపై  సటైరికల్‌గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అక్కా..నువ్వు కూడా మా బ్యాచేనా’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘మీరు పూర్‌ ఏంటి? చాలా రిచ్‌ కదా’ అని మరికొందరు స్పందించారు. దీనికి స్పందించిన లక్ష్మి ‘మా నాన్న రిచ్‌ తమ్ముడు.. నేను కాదు’ అంటూ సటైరికల్‌ రిప్లై ఇచ్చింది.

Also Read:

S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..

Salman Khan: ఆస్పత్రిలో సల్లూభాయ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..