Salman Khan: ఆస్పత్రిలో సల్లూభాయ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిన్న (డిసెంబర్ 26)న తెల్లవారుజాము పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది

Salman Khan: ఆస్పత్రిలో సల్లూభాయ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:07 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిన్న (డిసెంబర్ 26)న తెల్లవారుజాము పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. కాగా సల్లూ భాయ్‌ను చికిత్స నిమిత్తం ఎమ్‌జీఎమ్(మహాత్మా గాంధీ మిషన్) ఆస్పత్రికి తరలించారు. విషం లేని పాము కరవడంతో ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి అయ్యాడీ కండల వీరుడు. ‘ శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. విషరహిత పాము అతడిని కుట్టింది. ప్రస్తుతం సల్మాన్ బాగానే ఉన్నాడు. ఫ్యాన్స్‌ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని మందులు, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు ‘ అని సల్మాన్‌ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. అయితే ఆస్పత్రిలో సల్మాన్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘ భాయిజాన్‌ త్వరగా కొలుకోవాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌ అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ పాములు, కొండచిలువలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈక్రమంలోనే సల్మాన్‌ పాముకాటుకు గురయ్యాడని తెలుస్తోంది. కాగా నేడు (డిసెంబర్‌27) సల్మాన్ 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అతనికి బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ‘రాధే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇది అంచనాలను అందుకోలేకపోయింది. ఆతర్వాత బావ ఆయుష్‌ శర్మతో కలిసి ‘అంతిమ్‌’ చిత్రంలో నటించాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌ ‘టైగర్‌ 3’ సినిమాలో నటిస్తున్నాడు.

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?

Cyber cirme: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అంటే జాగ్రత్త.. ఎందుకంటే..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు