AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..

సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌ లు, 'అన్‌ స్టాపబుల్‌' లాంటి అదిరిపోయే టాక్ షోలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆహా.

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..
Telugu Indian Idol
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2021 | 7:08 PM

Share

సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌ లు, ‘అన్‌ స్టాపబుల్‌’ లాంటి అదిరిపోయే టాక్ షోలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆహా. ఇతర భాషల్లోని సూపర్‌ హిట్‌ సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫాంలో నంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఆహా. కాగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఆహా స్టూడియోస్ ప్రారంభించిన ఈ ఓటీటీ సంస్థ దీని ద్వారా సంగీత ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హిందీలో ఫేమస్‌ అయిన మ్యూజిక్‌ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌’ను తెలుగులోకి తీసుకురానుంది. కొన్ని రోజలు క్రితమే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా ఈ సంగీత కార్యక్రమానికి హోస్ట్‌గా ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీరామచంద్రను ఎంపిక చేశారు ఆహా నిర్వాహకులు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆహా మేకర్స్‌.

17 ఏళ్లకే ప్లే బ్యాక్‌ సింగర్‌గా అవతారమెత్తిన శ్రీరామచంద్ర 2010లో జరిగిన ఇండియన్‌ ఐడల్‌ (హిందీ) సీజన్‌-5 టైటిల్‌ను గెల్చుకున్న సంగతి తెలిసిందే. తన అద్భుతగానంతో తెలుగు, హిందీ సినిమా పాటలకు ప్రాణంప పోశాడు. ‘జగద్గురు ఆదిశంకర’, ‘ప్రేమా గీమా జాన్తానై’ వంటి సినిమాలతో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సంగీతంతోనే ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ ట్యాలెంటెడ్‌ సింగర్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ -5లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇతర కంటెస్టెంట్లకు భిన్నంగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ యంగ్‌ సింగరే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ విజేతగా నిలుస్తాడని చాలామంది ఊహించారు. అయితే దురదృష్టవశాత్తూ మూడో స్థానంలో నిలిచాడు. అయితే విజేతగా నిలవకపోయినా తన ప్రవర్తనతో ఎంతోమంది మనసులు గెల్చుకున్నాడీ ట్యాలెంటెడ్‌ సింగర్‌. కాగా ఆహా నిర్వహిస్తోన్న ఇండియన్‌ ఐడల్ షో కోసం ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మ్యూజిక్‌ రియాలిటీ షో ప్రారంభం కానుంది.

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?

Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..

Andhra Pradesh: వామ్మో! క్రేన్ తెస్తే కానీ పనవ్వలేదు.. వలకు చిక్కిన 750 కేజీల భారీ టేకు చేప