AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ముప్పై ఏళ్లలో ఇంతకంటే బెటర్ సబ్జెక్ట్ దొరకలేదు.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి విషయాలపై స్పందిస్తారో అంచనా వేయడం కష్టమే. ప్రతి సంఘటనపై తనదైన స్టైల్లో

Ram Gopal Varma: ముప్పై ఏళ్లలో ఇంతకంటే బెటర్ సబ్జెక్ట్ దొరకలేదు.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్..
Rgv
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 27, 2021 | 6:59 PM

Share

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి విషయాలపై స్పందిస్తారో అంచనా వేయడం కష్టమే. ప్రతి సంఘటనపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తుంటారు. వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి అప్డే్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సమాజంలో జరిగిన ప్రతి సంఘటనను సినిమాగా తెరకెక్కిస్తుంటారు వర్మ. ప్రస్తుతం ఆర్జీవి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఓ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి కొండా మురళి, కొండ సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా కొండా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికికొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరోఅదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ” సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరువినలేదు. ఓ ఎన్ని కల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలుచూశా. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేనుముంబైలో ‘సత్య’,’కంపెనీ’, ఇక్కడ ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధపోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా.

ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండోప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. త‌నను జైలులోచంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండాముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలకోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అదిపట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశా.

ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించితెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం… వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది. అందుకని, సినిమాకు ‘కొండా’ పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందనిభయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశా. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసివాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటేబెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ఫిల్మ్ అవుతుంది” అని అన్నారు.

Also Read: RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..

Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు