AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan Birthday: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిన్న (డిసెంబర్ 26)న తెల్లవారుజాము పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది

Salman Khan Birthday: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2021 | 7:01 PM

Share

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిన్న (డిసెంబర్ 26)న తెల్లవారుజాము పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. కాగా సల్లూ భాయ్‌ను చికిత్స నిమిత్తం ఎమ్‌జీఎమ్(మహాత్మా గాంధీ మిషన్) ఆస్పత్రికి తరలించారు. విషం లేని పాము కరవడంతో ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి అయ్యాడీ కండల వీరుడు. కాగా నేడు 56వ వసంతంలోకి అడుగుట్టాడు సల్లూభాయ్‌. ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడీ కండల హీరో. అదేవిధంగా పాము కాటు విషయంపై కూడా స్పందించారు. ‘పాన్వేల్‌లోని నా ఫౌంహౌస్‌ చుట్టూ అటవీ ప్రాంతమే. అక్కడ తరచూ పాములు తిరుగుతుంటాయి. నా బర్త్‌డే వేడుకలను సెలబ్రేట్‌ చేసేందుకు నా కుటుంబసభ్యులు, స్నేహితులు శనివారం రాత్రి ఈ ఫాంహౌస్‌కు వచ్చారు. అయితే ఆదివారం తెల్లవారుజాము ఓ గదిలో పాము కనిపించింది. దీంతో అక్కడున్న వారు భయంతో బిగ్గరగా కేకలు వేశారు. పామును పట్టుకుని అడవుల్లో వదిలేద్దామనుకున్నాను. దానిని పట్టుకుని బయటకు తీసుకువస్తుండగా.. అది నా చేతిపై మూడుసార్లు కరిచింది. వెంటనే నా కుటుంబసభ్యుల నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఆరుగంటల పాటు ఉన్నాను. ఆ తర్వాత కొన్ని మందులు ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి నన్ను డిశ్ఛార్జ్‌ చేశారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అయితే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పాము మళ్లీ కనిపించింది. దీంతో ఫొటో కూడా దిగాను. దాన్ని కూడా నా స్నేహితుడిగానే భావిస్తున్నా ‘ అని సల్మాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘రాధే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సల్మాన్‌. ఆతర్వాత బావ ఆయుష్‌ శర్మతో కలిసి ‘అంతిమ్‌’ చిత్రంలో నటించాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌ ‘టైగర్‌ 3’ సినిమాలో నటిస్తున్నాడు. కాగా నేడు బర్త్‌డే సందర్భంగా ‘భజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌ ‘పవన్‌పుత్ర భాయిజాన్‌’ను కూడా ప్రకటించాడు. కాగా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడన్న వార్తలను సల్మాన్‌ స్పందిస్తూ ‘ రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే అందుకు ఎంతో సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు బాలీవుడ్ భాయిజాన్‌.

Also Read:

Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Desmand Tutu: దక్షిణాఫ్రికా అణగారిన వర్గాల హీరో కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన వెంకయ్య, మోడీ..