Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

అఖిల్‌' అంటూ ఆరేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడు అఖిల్‌ అక్కినేని. ఆతర్వాత 'హలో' అంటూ

Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:02 PM

‘అఖిల్‌’ అంటూ ఆరేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడు అఖిల్‌ అక్కినేని. ఆతర్వాత ‘హలో’ అంటూ పలకరించాడు. ‘మిస్టర్‌ మజ్ను’ తో ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే విజయం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో తన రేంజ్‌ సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. కాగా ఈ సక్సెస్‌ను ఇలాగే కొనసాగించాలని తెగ కష్టపడుతున్నాడీ యంగ్‌ హీరో. కాగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ దర్శకత్వంలో అఖిల్‌ నటిస్తోన్న చిత్రం ‘ఏజెంట్‌’. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈక్రమంలో ఏజెంట్‌ పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్నాడీ యంగ్‌ హీరో. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నాడు. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లు కనిపిస్తోంది.

‘దేనికైనా ఆయనే నంబర్‌ వన్‌’.. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటోను షేర్‌ చేసుకున్నాడు అఖిల్‌. అందులో కండలు తిరిగిన దేహంతో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడీ యంగ్‌ హీరో. ‘త్వరలోనే తుపాన్‌ రాబోతుంది. నాకు ఈ విషయం తెలుస్తోంది’ అంటూ 2022 పేరుతో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ను తన పోస్టుకు జోడించాడు. కాగా తన మజిల్‌ పవర్‌ను చూపిస్తూ అఖిల్‌ షేర్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్‌ను ఎప్పుడూ ఇలా చూడలేదని సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ ఫొటోపై స్పందించిన రానా దగ్గుబాటి ఫైర్‌ ఎమోజీలతో కామెంట్‌ పెట్టగా. అభిమానులు కూడా ‘అయ్యగారు మీరే కింగ్‌’, ‘దేనికైనా సరే ఆయనే నంబర్‌ వన్‌’ అంటూ లవ్‌, హార్ట్‌, ఫైర్‌ ఎమోజీలతో కామెంట్‌ సెక్షన్‌ని నింపేస్తున్నారు.

Also Read: Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Mrs.India: మిసెస్‌ ఇండియా కిరీటం గెల్చుకున్న విజయవాడ ముద్దుగుమ్మ..

Viral video: మ్యూజిక్‌ షూట్‌లో చేదు అనుభవం.. సింగర్‌ ముఖంపై కాటేసిన పాము.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్