Viral Photo: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో వైఫ్ కూడా.. గుర్తుపట్టారా..?
ఇప్పుడు అంటే ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీనితో సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య గ్యాప్ తగ్గిపోయింది.

ఇప్పుడు అంటే ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీనితో సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య గ్యాప్ తగ్గిపోయింది. ఒకప్పుడు అయితే అభిమాన నటులుపై ఫ్యాన్స్ కురపించే ప్రేమ, అభిమానాలు వారికి తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఆ గ్యాప్‌ను లేకుండా చేసింది. తమ సినిమా అప్‌డేట్స్‌ను పంచుకోవడమే కాకుండా లైవ్ చాట్స్‌తో హీరోహీరోయిన్లు ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అంతేకాదు తన లైఫ్‌లో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ పిక్స్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. హీరో, హీరోయిన్లు వీలు కుదిరినప్పుడు తమ చైల్డ్‌హుడ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఒద్దికగా, ఎంతో పద్దతిగా ఓ వైపు తీక్షణంగా చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు చాలా అల్లరి అమ్మాయి అయింది. అయితే ఆ అల్లరి చాలామందికి ఇష్టమండోయ్. అందం, అమాయకత్వం, అభినయంతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. తెలుగులో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా..?. ఇక మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది జనీలియా. కాగా జనీలియాను తెలుగు ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. “వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ అంటూ బొమ్మరిల్లు మూవీలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. 2012లో నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది జెనీలియా. మధ్యలో నాలుగు చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌కే పరిమితమైన ఈ అల్లరి పిల్ల.. పదేళ్ల అనంతరం పూర్తిస్థాయి పాత్రతో ఓ మరాఠీ చిత్రంతో కనిపించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ చిత్రానికి ఆమె భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నారు.
View this post on Instagram
Also Read: మార్కెట్లో కొత్త అమ్మవారు.. దర్శిస్తే సకల అరిష్టాలు పోతాయట.. పోటెత్తుతున్న జనం
Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి