Viral: మార్కెట్లో కొత్త అమ్మవారు.. దర్శిస్తే సకల అరిష్టాలు పోతాయట.. పోటెత్తుతున్న జనం
పూటకో బాబా..రోజుకో అమ్మవారు.. అవును..ప్రజల అమాయకత్వాన్ని, మూఢ నమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు బాబాలు, అమ్మవార్ల అవతారమెత్తుతున్నారు కొందరు కేటుగాళ్లు.
పూటకో బాబా..రోజుకో అమ్మవారు.. అవును..ప్రజల అమాయకత్వాన్ని, మూఢ నమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు బాబాలు, అమ్మవార్ల అవతారమెత్తుతున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా తమిళనాడులో ప్రత్యక్షమైంది అన్నపూర్ణి అమ్మవారు. అమ్మ దర్శనం చేసుకుంటే చాలట. అన్ని అరిష్టాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో అన్నపూర్ణి అమ్మవారి పాదాలను తాకేందుకు ఎగబడుతున్నారు భక్తులు. ఐతే ఈ అమ్మవారు న్యూ ఇయర్ సందర్భంగా భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమ్మవారి స్పెషల్ దర్శనమంటూ చెన్నై శివార్లలో పోస్టర్లు వెలిశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మండపం ఓనర్‌తో పాటు ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిన వారిని విచారిస్తున్నారు.
ఐతే గతంలోనే ఈ అన్నపూర్ణి అమ్మవారిపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు మళ్లీ అమ్మవారి అవతారం ఎత్తడంతో షాకవుతున్నారు. ఎలాంటి సభలు, కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు. అయితే టెక్నాలజీ విషయంలో రాకెట్ వేగంతో దూసుకుతున్నా.. ఇంకా జనాలు.. ఇలా స్వయం ప్రకటిత అమ్మవార్లను, బాబాలను నమ్మడం.. వారి చేతుల్లో మోసపోవడం పరిపాటిగా మారింది.
Also Read: Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి
చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?