AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Heroine: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు కోకొల్లలు. ఏదైనా చిన్న అకేషన్ వస్తే చాలు.. ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటారు.

Tollywood Heroine: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..'పదహారణాల తెలుగమ్మాయి' ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
Tollywood Heroine
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2021 | 6:51 PM

Share

సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు కోకొల్లలు. ఏదైనా చిన్న అకేషన్ వస్తే చాలు.. ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఇక వాటిని ఫ్యాన్స్ నిమిషాల్లో వైరల్ చేసేస్తారు. ఇదిలా ఉంటే.. నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పలు చైల్డ్‌హుడ్ ఫొటోస్ షేర్ చేస్తారు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది సినిమా తారాల చిన్ననాటి ఫోటోలు చూస్తే.. అప్పుడు ఇలా ఉండేవారా..! అని ఆశ్చర్యపోతాం. ఈ ఫోటోలో ఉంది ఎవరో తెలిస్తే కూడా మీరు కంగుతింటారు. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇంకో క్రేజీ విషయం ఏమిటంటే ఈమె తెలుగమ్మాయే. అయ్యో.. ఇంకా గుర్తుపట్టలేదా.. మేమే చెప్పేస్తాం.

శ్రీదివ్య.. యస్.. ఈమె మన తెలంగాణ అందునా హైదరాబాద్ అమ్మాయే.  1993 లో పుట్టిన శ్రీదివ్య.. బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. హనుమాన్ జంక్షన్, వీడే, యువరాజు సినిమాల్లో చిన్నారి పాత్రల్లో నటించింది. రవిబాబు దర్శకత్వం వహించిన మనసారా చిత్రంతో హీరోయిన్‌గా మారింది.  ఆ తర్వాత తెలుగులో బస్ స్టాప్, కేరింత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళ్‌ ఇండస్ట్రీలో మాత్రం శ్రీ దివ్య స్టార్ స్టేటస్ అందుకుంది. విశాల్, కార్తీ,  శివకార్తికేయన్‌‌‌ లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది. 2017 అనంతరం ఎందుకో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది శ్రీదివ్య. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఎంతో పద్దతిగా, అణుకువగా.. ఉండే ఈ బ్యూటీకి తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడం బాధాకరం.

View this post on Instagram

A post shared by Sri Divya (@sd_sridivya)

View this post on Instagram

A post shared by Sri Divya (@sd_sridivya)

Also Read: Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు.. శనివారం రాత్రి ఘటన