AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC Tweet: తెలంగాణ ఆర్టీసీ వాడకం మాములుగా లేదుగా.. ఈసారి మహేష్‌ బాబు డైలాగ్‌ను..

TSRTC Tweet: ఆర్టీసీ ఎండీగా సజ్జనర్‌ నియమితులైన తర్వాత ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని, పెళ్లి బస్సులకు రాయితీతో పాటు, వివాహ జంటకు...

TSRTC Tweet: తెలంగాణ ఆర్టీసీ వాడకం మాములుగా లేదుగా.. ఈసారి మహేష్‌ బాబు డైలాగ్‌ను..
Narender Vaitla
|

Updated on: Dec 26, 2021 | 6:35 PM

Share

TSRTC Tweet: ఆర్టీసీ ఎండీగా సజ్జనర్‌ నియమితులైన తర్వాత ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని, పెళ్లి బస్సులకు రాయితీతో పాటు, వివాహ జంటకు బహుమతులు ఇవ్వడం లాంటి నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల పాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఆర్టీసీని ఎక్కువ మంది ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్‌ను క్రియేట్ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంక్రాంతి పండుగకు గాను సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులనే ఉపయోగించుకోవాలంటూ ఓ మీమ్‌ను రూపొందించారు.

అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పేందుకు టీఎస్‌ ఆర్టీసీ హీరో మహేష్‌ బాబు డైలాగ్‌ను వాడుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్‌, పృథ్వీరాజ్‌ల మధ్య జరిగిన సంభాషణను మీమ్‌గా మార్చేశారు. ఇందులో పృథ్వీ మహేష్‌తో మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి మన ఊరు వెళ్దాం అంటేనే భయమేస్తోంది అయ్యా, అన్ని టికెట్స్‌ రేట్లు పెంచేశారు. ఎక్కడా సేఫ్టీ కూడా లేదు’ అని అంటాడు. దీనికి మహేష్‌ బాబు స్పందిస్తూ.. ‘అందుకే బాబాయ్‌ నాలా సంక్రాంతికి TSRTCలో టిక్కెట్ బుక్‌ చేస్కో, తక్కువ ధరతో భద్రతతో కూడిన ప్రయాణం చేసేయ్‌’ అంటాడు. ఇలా రూపొందించిన మీమ్‌ను ట్వీట్ చేసిన సజ్జనర్‌.. ‘తక్కువ ధరలో బస్సు టిక్కెట్టు, శుభప్రదమైన సుఖ ప్రయాణం TSRTCలోనే’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు.. ఆర్టీసీ ప్రమోషన్‌ చూసి ఫిదా అవుతున్నారు.

Also Read: Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక మంచుతో గడ్డకట్టింది.. గుండెను పిండేసే వీడియో వైరల్‌గా మారింది..!

Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్న కాంగ్రెస్.. జనవరి 3 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం షురూ!

ఓలా స్కూటర్‌ నిరీక్షణకు తెర !! ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ డెలివరీ ప్రారంభం !! వీడియో

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..