Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక మంచుతో గడ్డకట్టింది.. గుండెను పిండేసే వీడియో వైరల్‌గా మారింది..!
Frozen Deer: పడిపోయే ఉష్ణోగ్రతలో జంతువులు చనిపోతాయని మీకు తెలుసా.. ఇలాంటి హృదయవిదాకర ఘటన ఒకటి జరిగింది. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మూగ జీవం గుండె ఆగిపోయింది.
Viral Video: చలికాలం వచ్చిందంటే సామాన్యులతోపాటు జంతువులకు సైతం ఇబ్బందులు తప్పవు. మనం మనుషులం చలిని ఆస్వాదిస్తూంటే, ఈ చలిలో హిమపాతాన్ని ఆస్వాదించడానికి కొండలపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. కానీ పడిపోయే ఉష్ణోగ్రతలో జంతువులు చనిపోతాయని మీకు తెలుసా.. ఇలాంటి హృదయవిదాకర ఘటన ఒకటి జరిగింది. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మూగ జీవం గుండె ఆగిపోయింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక జింక నడుస్తున్నప్పుడు స్తంభించి పోవడాన్ని మీరు చూడవచ్చు.
వీడియోలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న జింకను చూడొచ్చు. అది నోరుతో సహా శరీరం మొత్తం గడ్డకట్టినట్లు కనిపిస్తుంది. జింక పారిపోవడానికి ప్రయత్నించిన వెంటనే, అక్కడికక్కడే మంచుతో గడ్డకట్టుకుపోయింది. అటువంటి పరిస్థితిలో, ఒక స్థానిక వ్యక్తి దానిని పట్టుకుని, అతని శరీరం నుండి మంచును తొలగించాడు. దీంతో ఆ జింకకు గొప్ప ఉపశమనం కలిగింది. వెంటనే గంతులేసుకుంటూ చెంగు చెంగున పరుగలు పెట్టింది.
ఇందుకు సంబంధించి ఈ వీడియోను మీరు చూడండి…
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రాసే వరకు, ఈ వీడియోకు వందల కొద్దీ లైక్‌లు, వేల కామెంట్లు వచ్చాయి. అదే సమయంలో, జంతువుల అటువంటి స్థితిని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అనేక ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. వీడియోలో ఇచ్చిన సమాచారం ప్రకారం, కజకిస్థాన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 56 డిగ్రీలు. ఈ ఉష్ణోగ్రతలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ వీడియోను memewalanews అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ఆ వీడియో క్యాప్షన్‌లో ‘చల్లని జింక’ అని రాసి ఉంది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత శీతాకాలం తీవ్రత ఎక్కువగానే ఉంది. దీని కారణంగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా పడిపోతుంది. చాలా చోట్ల భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా ప్రజల పరిస్థితి క్షీణించింది. దాని ప్రభావం జంతువులపై కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కజకిస్థాన్‌కి చెందిన ఈ వీడియో చూసి జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.
Read Also…. Karnataka Curfew: డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
ఓలా స్కూటర్ నిరీక్షణకు తెర !! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ ప్రారంభం !! వీడియో