Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్న కాంగ్రెస్.. జనవరి 3 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం షురూ!
వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ జనవరి 3 నుంచి పంజాబ్‌లో ప్రచారం ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Congress on Punjab Elections 2022: వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ జనవరి 3 నుంచి పంజాబ్‌లో ప్రచారం ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదీ లేకుండానే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన వెంటనే సీఎంగా చరణ్‌జిత్ చన్నీ బాధ్యతలు చేపట్టారు. 2022 ఎన్నికల్లో చరణ్‌జిత్ చన్నీ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్తుందని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అయితే, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ వైఖరి దృష్ట్యా హైకమాండ్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ నెలలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌తో సమావేశమయ్యేందుకు చన్నీ, సిద్ధూ ఆయన నివాసానికి చేరుకున్నారు. ముగ్గురు నేతల మధ్య జరుగుతున్న ఈ సమావేశంలో వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై చర్చనీయాంశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాహుల్ గాంధీని కలిశారు.
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 10 సంవత్సరాల తర్వాత SAD BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం గురించి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీకి 38.5 శాతం ఓట్లు రాగా, అకాలీదళ్‌కు 25.3 శాతం ఓట్లు వచ్చాయి. అకాలీదళ్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం తక్కువగా ఉంది. అయితే సీట్ల పరంగా ఆప్ లాభపడింది. అకాలీ కంటే ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Read Also… Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!