Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి
అనసూయ.. ఇప్పుడు అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు హాట్ ఫేవరేట్. అనుకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతుంది.
అనసూయ.. ఇప్పుడు అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు హాట్ ఫేవరేట్. అనుకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్స్ రేంజ్‌కి ఆమె స్టార్‌డమ్ చేరింది. ఆమె ఫ్యాన్ బేస్ ఏ రేంజ్‌కు చేరిందో తెలిపే ఇన్సిడెంట్ ఇది. ఖమ్మంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనసూయ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనసూయను చూడాలని.. ఆమెకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, కుదిరితే ఓ సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. అంతగా అభిమానుల పోటెత్తడంతో షాకైన అను.. వారిని డిసప్పాయింట్ చేయకూడదని కొందరికి ఫోటోలు ఇచ్చింది. కొంతమందికి మాత్రం నిరాశ తప్పలేదు. అయితే అనసూయ తన చేయిని తాకడంతో.. ఓ ఫ్యాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ సంబరాలు చేసుకున్నాడు. తన కలల రాణి చేతిని తాకిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమాని అంతలా హ్యాపీ ఫీల్ అవ్వడంపై అనసూయ స్పందించింది. ‘అయ్యో శానిటైజ్ చేసుకోండి’ అని అతడిని సరదాగా ఆటపట్టించింది.
కాగా ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ద్రాక్షాయణి పాత్రతో మెప్పించింది అనసూయ. అయితే ఇటీవల తన తండ్రి చనిపోవడంతో పాటు వరుస షూటింగ్స్ ఉండటంతో జబర్దస్త్ షోకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది అనసూయ.
Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
ఈ ఏడాది ట్రాఫిక్ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..