AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Pre Release Event Highlights: ప్రీరిలీజ్ వేడుకలో తారక్, చరణ్ ల సందడి .. పోటాపోటీగా అభిమానుల నినాదాలు..

RRR Movie Pre Release in Chennai Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు

RRR Movie Pre Release Event Highlights: ప్రీరిలీజ్ వేడుకలో తారక్, చరణ్ ల సందడి .. పోటాపోటీగా అభిమానుల నినాదాలు..
Rrr Pre Release Event
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2021 | 9:51 PM

Share

RRR Movie Pre Release in Chennai Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటి సారి చరణ్, తారక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడంతో ఈ మూవీ కోసం నందమూరి, మెగా ప్యామిలీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ హావా కొనసాగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈమూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చేపట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ వరుసగా భాషతో సంబంధం లేకుండా మూవీ ప్రమోషన్స్‏లో బీజీ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‏ను చెన్నైలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Dec 2021 09:47 PM (IST)

చరణ్ నుంచి చాలా నేర్చుకున్నాను.. రాజమౌళి..

చరణ్ నుంచి చాలా నేర్చుకున్నాను. తన గురించి తను అంత సెక్యూర్‏గా ఆలోచించే యాక్టర్‏ను ఇప్పటివరకు చూడలేదన్నారు రాజమౌళి. సౌత్ పోల్, నార్త్ పోల్ మాదిరిగా ఆ ఇద్దరూ అయస్కాంతంలాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు అతుకున్నారని రాజమౌళి అన్నారు.

  • 27 Dec 2021 09:42 PM (IST)

    తారక్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం.. రాజమౌళి..

    తారక్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. సింహంలా మీద వచ్చి పడిపోతుంటారన్నారు. తారక్ చెప్పిన సమయానికి కంటే ముందే వచ్చేస్తారన్నారు. ఎన్టీఆర్ లాంటి యాక్టర్ దొరకడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమన్నారు. తారక్ థ్యాంక్స్ చెప్పగా.. ధన్యావాదాలు చెప్పి దూరం చేయకండి అంటూ నవ్వూలు పూయించారు తారక్.

  • 27 Dec 2021 09:39 PM (IST)

    రాజమౌళి కామెంట్స్ ..

    ఆర్ఆర్ఆర్ తమిళ్ వెర్షన్ హక్కులను తీసుకున్నందుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువే అన్నారు.

  • 27 Dec 2021 09:31 PM (IST)

    తెలుగులో మాట్లాడిన రామ్ చరణ్..

    ఇండస్ట్రీలో తనకు మొట్ట మొదటి హిట్ రాజమౌళి ఇచ్చారని తెలిపారు. అద్భుతమైన మ్యూజిక్ అందించిన కీరవాణి గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తారక్ తనకంటే సంవత్సరం పెద్దవాడని.. అయిన చిన్నపిల్లాడిగానే చేస్తాడని.. బ్రదర్, స్నేహితుడిగా తనకు సపోర్ట్ చేశారని అన్నారు. చనిపోయే నా బ్రదర్ ను మనసులో పెట్టుకుంటాన్నారు చరణ్.

  • 27 Dec 2021 09:26 PM (IST)

    తమిళంలో మాట్లాడిన తారక్..

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ఎన్టీఆర్ తన అభిమానులను తమిళంలో పలకరించారు. అనంతరం అభిమానులందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు తారక్ తెలిపారు.

  • 27 Dec 2021 09:19 PM (IST)

    శివ కార్తికేయన్ సందడి..

    తమిళ్ స్టా్ర్ హీరో శివ కార్తికేయన్ సందడి చేశారు. నాటు నాటు పాటకు స్టెప్పులేయాలని కోరగా.. తనకు రాదంటూ నవ్వులు పూయించారు.

  • 27 Dec 2021 09:02 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    ఇన్నాళ్లు సినిమా అంటే ఓ ప్రొఫెనల్‌ ఎఫైర్‌. అక్కడ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయితే వర్క్‌ డిస్ట్రబ్‌ అవుతుందన్న అనుమానాలు ఉండేవి. కానీ ఆ ట్రెండ్‌ పూర్తిగా మార్చేశాఉ. రాజమౌళి. సినిమాను పక్కా ఫ్యామిలీ ఎఫైర్‌గా మార్చేశారు. ఒకే ప్రాజెక్ట్‌లో ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయితే అవుట్‌ క్వాలిటీ మరో లెవల్‌లో ఉంటుందని పదే పదే ప్రూవ్ చేస్తున్నారు.

  • 27 Dec 2021 08:49 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఎలా ఉంటారు? అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ఎలా ఉంటారు? సీత పాత్రలో ఆలియా స్టైలింగ్‌ ఎలా ఉంటుంది? మొన్నమొన్నటిదాకా ఇలాంటి అనుమానాలు చాలా చాలానే. వాటన్నిటికీ ట్రైలర్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. చరణ్, తారక్, అలియాను ఒకే స్క్రీన్ పై చూసేందుకు పాన్ ఇండియా లెవల్లో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

  • 27 Dec 2021 08:37 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    తమిళంలో తారక్, చరణ్ మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక్కడ రాజమౌళి మాట్లాడుతూ.. చరణ్ కంటే తారక్ అల్లరి ఎక్కువగా ఉంటుందని తెలిపారు..

  • 27 Dec 2021 08:18 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    ఇండియన్‌ మూవీ లవర్స్‌నే కాదు.. ఇంటర్నేషనల్ ఫిలిం ఆడియన్స్‌ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ట్రిపులార్. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్‌ తరువాత రాజమౌళి కాంపౌండ్‌ నుంచి వస్తున్న సినిమా కావటంతో ట్రిపులార్ మీద నేషనల్‌ లెవల్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వరల్డ్ రికార్డ్స్‌ను టార్గెట్ చేస్తుంది జక్కన్న టీమ్‌.

  • 27 Dec 2021 08:02 PM (IST)

    తారక్, చరణ్ ఎంట్రీ అదుర్స్..

    చెన్నైలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు చరణ్, తారక్ వచ్చేశారు. ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇస్తున్న సమయంలో అభిమానులు నినాదాలతో రచ్చ చేశారు. తారక్, చరణ్ అభిమానులను కంట్రోల్ చేయడం అక్కడున్న సెక్యూరిటీకీ కష్టంగా మారింది.

  • 27 Dec 2021 07:58 PM (IST)

    శివకార్తికేయన్ ఎంట్రీ

    చెన్నైలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు తమిళ స్టార్ హీరోస్.. శివ కార్తికేయన్.. ఉదయనిది స్టాలిన్ వచ్చేశారు.

  • 27 Dec 2021 07:46 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే.. కథా కథనాలతో పర్ఫెక్ట్‌గా సెట్‌ అవ్వాలి. అదే సినిమా మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించాలంటే మాత్రం హీరో ఎలివేషన్ మరో లెవల్‌ ఉండాలి. అలా ఉన్నప్పుడే కరమర్షియల్ సినిమా పర్ఫెక్ట్‌గా పండుతుంది. బాక్సాఫీస్‌ మీద కనకవర్షం కురుస్తుంది. ఈ ఫార్ములా పర్ఫెక్ట్‌గా తెలుసు కాబట్టే రాజమౌళి ఆ రేంజ్‌లో సక్సెస్‌లు కొడుతున్నారు.

  • 27 Dec 2021 07:34 PM (IST)

    ప్రీరిలీజ్ ఈవెంట్లో తారక్, చరణ్ సందడి…

    చెన్నైలో ఘనంగా జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ వేడుకకు కాసేపటి క్రితం తారక్, చరణ్, రాజమౌళి విచ్చేశారు. ఎన్టీఆర్, చరణ్ రావడంతో ఇరువురి అభిమానులు పోటాపోటిగా నినాదాలు చేస్తున్నారు. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా.. రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు హజరయ్యారు.

  • 27 Dec 2021 07:18 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    రాజమౌళి సినిమాలో హీరోలు మాత్రమే కాదు ఆ సినిమాలో కనిపించే వెపన్స్ కూడా తెర మీద కొత్తదనాన్ని చూపిస్తాయి. ప్రతీ సినిమాలో కొత్త కంటెంట్‌ కొత్త ఎమోషన్‌తో పాటు ఓ కొత్త ఆముధాన్ని కూడా పరిచయం చేస్తుంటారు. సింహాద్రి సినిమా నుంచి ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు జక్కన్న.

  • 27 Dec 2021 07:00 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    ఆడియన్స్‌ ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుకోవడం జక్కన్నకు కొత్తేమీ కాదు. ఆయన సినిమాల్లో అండర్‌కరెంట్‌గా భావోద్వేగాలు అలాఅలా కదులుతూనే వుంటాయి. జక్కన్న మనసులో భావాలను పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేయగల సంగీత దర్శకుడు కీరవాణి. అందుకే ఈ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సాంగ్‌ ఓ మాస్టర్ పీస్‌లా మిగిలిపోయింది.

  • 27 Dec 2021 06:40 PM (IST)

    ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైనంది. తమిళనాడుతో సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు భారీగా హాజరయ్యారు. సీఎం ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అభిమానుల నినాదాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ తోపులాట అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి సవాలుగా మారింది.

  • 27 Dec 2021 06:25 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాతో పరిచయం చేశాడు జక్కన్న. ఇక ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరుల మధ్య స్నేహం.. యుద్ధం వంటి అంశాలను ప్రేక్షకులకు చూపించబోతున్నారు రాజమౌళి. దీంతో ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో భాషతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నారు ఆర్ఆర్ఆర్ సాంగ్స్, ట్రైలర్.

  • 27 Dec 2021 05:56 PM (IST)

    ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్..

    ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది.

  • Published On - Dec 27,2021 5:47 PM