TS RTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు.. ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు..
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇక రూ.10 నాణెం విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నాణెలు చెల్లడం లేదని పుకార్లు వ్యాపించడంతో కిరాణ దుకాణ వాల్లు, ఇతర వ్యాపారస్తులు పది రూపాయల నాణేలను తీసుకోవడం లేదు. అలాగే ఆర్టీసీ బస్సులలో తీసుకుంటారా..?లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ కండక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు ఎలాంటి అనుమానం లేకుండా రూ.10 నాణేలను ఆర్టీసీ బస్సుల్లో వినియోగించుకోవచ్చని ప్రకటించారు. టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులను ఆదేశించారు. ఇక ఎండీ సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో పది రూపాయల నాణెం సమస్యకు చెక్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దగ్గర పది రూపాయల నాణెం తీసుకోని కండక్టర్లు. ప్రయాణికుల నుంచి టిక్కెట్ కోసం పది రూపాయల నాణేలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్టీసీ ఆదేశాలు. #Rs10Coins #10RupeeCoins @TSRTCHQ @tsrtcmdoffice pic.twitter.com/aNZWYWk361
— Hi Hyderabad (@HiHyderabad) December 26, 2021
ఇవి కూడా చదవండి: