Telangana: మరికొద్ది క్షణాల్లో మూడు ముళ్లు పడిపోయేవి.. ఆమె ఎంట్రీతో సీన్ రివర్స్
'ఆగండి', 'ఆగండి', 'ఆగండి'... సినిమాల్లో పెళ్లి జరుగుతుండగా.. ఈ డైలాగ్ వినిపించడం చాలా కామన్. కానీ అదేంటో రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి సీన్స్ ఇప్పుడు తారసపడుతున్నాయి.
‘ఆగండి’, ‘ఆగండి’, ‘ఆగండి’… సినిమాల్లో పెళ్లి జరుగుతుండగా.. ఈ డైలాగ్ వినిపించడం చాలా కామన్. కానీ అదేంటో రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి సీన్స్ ఇప్పుడు తారసపడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సినీ పక్కీలో పెళ్లి నిలిచిపోయింది. కల్యాణ మండపంలో వరుడి ప్రేయసి ప్రత్యక్షమవడంతో.. సీన్ రక్తికట్టింది. దీంతో తనను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూశాడని పెళ్లి కొడుకుపై.. పెళ్లి కూతురు కేసు పెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తితో ఇందారం గ్రామానికి చెందిన మాధవి అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎప్సీఏ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి తంతు ప్రారంభించారు పెద్దలు. బంధుమిత్రలు, మంగళవాయిద్యాలతో మండపం మెరిసిపోతుంది. ఈ క్రమంలో పెళ్లి కొడుకు వినోద్ ప్రేయసి చైతన్య పెళ్లి మండపానికి వచ్చింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. ఇప్పుడు మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని అక్కడివారికి చెప్పింది. దీంతో వినోద్, మాధవిల పెళ్లి ఆగిపోయింది. తనను మోసం చేశాడంటూ పెళ్లి కూతురు మాధవి మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కొడుకు వినోద్‌పై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: మార్కెట్లో కొత్త అమ్మవారు.. దర్శిస్తే సకల అరిష్టాలు పోతాయట.. పోటెత్తుతున్న జనం
Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి