AP News: వాగులో ఎండిపోయిన నీరు.. బయటపడింది చూసి ఆశ్చర్యానికి లోనైన జనం
ప్రకాశం జిల్లాలో పురాతన వెంకటేశ్వరస్వామి విగ్రహం బయటపడింది. వాగులో నీరు ఎండిపోవడంతో విగ్రహం కనిపించగా, స్థానిక ఆలయ కమిటీ సభ్యులు విగ్రహాన్ని బయటకు తీయించారు. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

అది ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని కనక సురభేశ్వరకోన గ్రామం. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ వాగు ఉంది. ఎండల తీవ్రత పెరగడంతో.. ఆ వాగులోని నీరు ఎండిపోయింది. అందులో అనూహ్య రీతిలో పురాతన వెంకటేశ్వరస్వామి విగ్రహం బయల్పడింది. దీంతో స్థానికులు, పూజారులతో కలిసి విగ్రహాన్ని బయటకు తీయించారు. బ్రహ్మణ సత్రం వద్ద ఉంచగా.. భక్త పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారు. విగ్రహం బయటపడిన విగ్రహం తెలియడంతో.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి.. వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Venkateswara Swamy Idol
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ…
హర హర మహాదేవ శంభో శంకర.. అంటూ.. అన్ని శివాలయాల్లో శివరాత్రి శోభ కొనసాగుతోంది. శివరాత్రి అంటే ఎటుచూసినా భక్తిభావ తరంగం. మార్మోగే ప్రణవ నాదం. పల్లెలు పట్టణాలు మహాశివరాత్రి శోభతో కళకళలాడుతున్నాయి. అభిషేకాలు, ఉపవాస దీక్షలు, జాగారాలతో భక్తకోటి పరవశిస్తోంది. “ఏక బిల్వం శివార్పణం” అంటూ..మహాదేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తోంది.
పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహా శివరాత్రి. శివుడు అంటే మంగళకరమైవాడు అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని భావిస్తారు. ఆదిభిక్షువు ఆనంద తాండవం చేసే రాత్రి మహా శివరాత్రి. అందుకే శివరాత్రి రోజున నిద్రపోకుండా జాగరణ చేయాలని చెబుతారు.
ఫిబ్రవరి 8న శివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి మొదలైంది.. శైవక్షేత్రాల్లో కోలాహలం కనిపిస్తోంది.. ఆలయాలు విద్యుత్ కాంతుల మధ్య కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రాలుండటంతో.. రాజమండ్రిలోని గోదావరి తీరం భక్త జనులతో కిటికిటటాడుతోంది. ఈ చుట్టుపక్కల ద్రాక్షారామం, సామర్లకోట, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో.. ఎన్నో శివాలయాలుండటంతో.. ఇక్కడికి భారీగా వస్తున్నారు భక్తులు. గోదావరిలో స్నానమాచరించి.. తర్వాత శివాలయ దర్శనం మంచిదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు.
అటు వారణాసిలోని పవిత్ర కాశీ విశ్వనాథేశ్వరుని క్షేత్రం శివరాత్రి నేపథ్యంలో భక్తులతో కిటకిటలాడిపోతుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తలు శివయ్య దర్శన కోసం పోటెత్తుతున్నారు. గంగానది తీరం పవిత్ర స్నానాలతో రద్దీగా కనిపించింది. ముక్కంటి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




