AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: ఫోన్ పే కొట్టు.. గంజాయి ప్యాకెట్ పట్టుకెళ్లు.. విస్తుపోయిన పోలీసుల

ఆమె గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఇంకేముంది.. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్లి సోదాలు చేశారు. ఘాటైన గంజాయి గుప్పుమంది. మేడమ్ గారి బాగోతం బట్టబయలైంది. అయితే ఆమె గంజాయి అమ్మూతూ పోన్ ఫే పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం చూసి పోలీసులు కంగుతిన్నారు.

Anantapur: ఫోన్ పే కొట్టు.. గంజాయి ప్యాకెట్ పట్టుకెళ్లు.. విస్తుపోయిన పోలీసుల
Ganja
Ram Naramaneni
|

Updated on: Nov 24, 2023 | 11:59 AM

Share

డిజిటల్ ఇండియా, క్యాష్ లెస్ పేమెంట్స్ వాడకాన్ని గంజాయి స్మగ్లర్లు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. పోలీసులకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ మహిళ ఇంట్లోనే చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి గంజాయి సేవించే వారికి ఫోన్ పే ద్వారా విక్రయిస్తుంది. ఇంటికి వచ్చి గంజాయి సేవించేవారు ఫోన్ పేలో స్కాన్ చేయటం.. 200, 300 రూపాయలకు ప్యాకెట్ తీసుకెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.

ఈజీ చెల్లింపులకు ఫోన్ పే వాడండి అంటూ యాడ్స్ లో చూస్తాం… సరిగ్గా ఇక్కడ గంజాయి స్మగ్లర్ షేక్ సోను కూడా అదే చేసింది. చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు…. ఫోన్ పే లో డబ్బులు ఉంటే చాలు… ఫోన్ పే చెయ్యి… ప్యాకెట్ తీసుకెళ్ళు అనే పద్ధతిలో గంజాయి స్మగ్లింగ్ చేయడం పోలీసులనే ఆశ్చర్యం కలిగించింది.

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు సీరియస్

ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా తనిఖీల్లో పట్టుబడుతుండటంతో పోలీసులు కూడా అప్రమత్తమైయ్యారు. గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఇక అడుగడుగా చెక్‌ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకేందు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. సులభంగా డబ్బు సంపాదలనకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులను, యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు  గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పదే, పదే గంజాయి కేసుల్లో పట్టుబడిన కొందర్ని నగర బహిష్కరణ చేశారు. అయితే ఎన్ని కేసులు పెట్టి జైలుకు వెళ్లినా.. కొందరు బయటకు వచ్చి ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ఇస్మార్ట్ ఐడియాలతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు పంజా విసరాల్సిన అవసరం కనిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..