YSRCP: విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదలకు సీఎం షెడ్యూల్ ఖరారు..
ఏపీ సీఎం జగన్, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలనను సాగిస్తున్నారు. తన సంక్షేమ క్యాలెండర్‌లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. నిధుల కొరత ఎదురైనప్పటికీ చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నవంబర్ 29న విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు సర్వం సిద్దమైంది. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది.

ఏపీ సీఎం జగన్, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలనను సాగిస్తున్నారు. తన సంక్షేమ క్యాలెండర్‌లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. నిధుల కొరత ఎదురైనప్పటికీ చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నవంబర్ 29న విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు సర్వం సిద్దమైంది. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంతో పాటూ కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ విడత నిధులను విడుదల చేసి డిశంబర్, జనవరి నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ఉన్నత చదువులు చదువుకునే వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. చదువుకోవాలని ఆశ ఉండి.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే వారికి ఈ పథకం చేదోడుగా నిలుస్తుంది. పిల్లల చదువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో విద్యాదీవెన, వసతి దీవెన అనే పథకాలను ప్రవేశపెట్టారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తూ వారికి చేదోడుగా నిలుస్తోంది ప్రభుత్వం. ఈ సారి నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో నగదు జమ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక నిబంధన తీసుకొచ్చింది. విద్యార్థితో పాటూ తల్లి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ముందుగా సూచించింది. ఈ సారి కుదరకపోతే మరో విడత నగదు జమ అయ్యే సమయానికి జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలని తెలిపింది. ఈ ఏడాదికి సంబంధించిన నిధులను పిల్లల అకౌంట్లో జమ చేయనున్నారు సీఎం జగన్. అందుకు నవంబర్ 29 తేదీని ఖరారు చేశారు.
సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే నాడు నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం వంటి పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది విడుదల చేయనున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,593 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యారంగంపై సీఎం జగన్ వెచ్చించిన నిధులు రూ. 69,289 కోట్లుగా తెలుస్తోంది. ఈనెల 29న విడుదల చేసే నిధులతో దాదాపు 11 లక్షలకుపైగా తల్లులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




