YSRCP: రెండో దశ సామాజిక సాధికార యాత్రకు తరలివస్తున్న జనం.. సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న రథం
ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవాళ బొబ్బిలి, కడప, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రతో కడప నగరం జనసంద్రంగా మారింది. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆధ్వర్యంలో కడప నియోజకవర్గంలో బస్సు యాత్ర జరిగింది.

ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవాళ బొబ్బిలి, కడప, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రతో కడప నగరం జనసంద్రంగా మారింది. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆధ్వర్యంలో కడప నియోజకవర్గంలో బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన సభలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పేదల తలరాత మార్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా.. వైసీపీది పేదల పక్షపాత ప్రభుత్వం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు.. హామీలు అమలు కావు.. అని ఆరోపించారు. ఇక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ బస్సు యాత్రకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
ఈ బస్సు యాత్రలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్‌తోపాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సామాజిక సాధికారతలో దేశానికే రోల్ మోడల్ సీఎం జగన్ అని కొనియాడారు మంత్రి పినిపె విశ్వరూప్. పేదల కోసం, భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నేత జగన్ అని చెప్పారు. మొత్తంగా.. ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..