Hen Birthday: కోడిపుంజుకు గ్రాండ్ గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌.! 500 మందికి భోజనాలు.. వీడియో.

Hen Birthday: కోడిపుంజుకు గ్రాండ్ గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌.! 500 మందికి భోజనాలు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 24, 2023 | 10:22 AM

సాధారణంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ మనుషులు చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో తమ పెంపుడు జంతువులైన కుక్కలు, ఆవులకు పుట్టినరోజు నుంచి స్వయంవరాలు, పెళ్లిరోజులు, సీమంతాలు కడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం కాస్త వెరైటీగా ఆలోచించి కోడిపుంజుకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిపించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

సాధారణంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ మనుషులు చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో తమ పెంపుడు జంతువులైన కుక్కలు, ఆవులకు పుట్టినరోజు నుంచి స్వయంవరాలు, పెళ్లిరోజులు, సీమంతాలు కడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం కాస్త వెరైటీగా ఆలోచించి కోడిపుంజుకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిపించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీమలాపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, కవిత దంపతులకు ఇద్దరు సంతానం. వారు ఆరేళ్ల క్రితం 5 రూపాయలతో ఓ కోడిపిల్లను కొని ప్రేమగా పెంచుకున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా కోడుజుంజుని వెంటపెట్టుకొని వెళ్లేవారు. ఇంట్లోని మరోకుటుంబ సభ్యుడుఆ ఆ కోడిపుంజును వారు పెంచారు. రాత్రి వేళ కోడిపుంజు ఏసీ గదిలో పడుకుంటుంది. చిక్కు పేరుతో ఓ యూట్యూట్‌ ఛానెల్‌ కూడా తెరిచారు. అందులో తమ కోడిపంజుకు సంబంధించిన వీడియోలు ఎన్నో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో తమ కోడిపుంజు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. దాదాపు 500 మందికి గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన కోడిపుంజుతో కేకు కట్‌ చేయించి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.