AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhumi Pednekar: ఫొటోస్ షేర్ చేస్తూ నరకం అనుభవించా అంటూ నటి భూమీ పెడ్నేకర్ పోస్ట్..

Bhumi Pednekar: ఫొటోస్ షేర్ చేస్తూ నరకం అనుభవించా అంటూ నటి భూమీ పెడ్నేకర్ పోస్ట్..

Anil kumar poka
|

Updated on: Nov 24, 2023 | 10:02 AM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కాస్తంత కోలుకున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చాలా రోజుల తరువాత ఫ్రెష్‌గా ఫీలవుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఆమె ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక డెంగీ దోమ తనను 8 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిందని ఆ రోజు నిద్రలేచాక ఎటువంటి ఇబ్బందీ అనిపించలేదు

ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కాస్తంత కోలుకున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చాలా రోజుల తరువాత ఫ్రెష్‌గా ఫీలవుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఆమె ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక డెంగీ దోమ తనను 8 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిందని ఆ రోజు నిద్రలేచాక ఎటువంటి ఇబ్బందీ అనిపించలేదు కాబట్టి.. ఓ చిన్న సెల్ఫీ తీసుకున్నాననీ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇచ్చింది. తన అనారోగ్యం కారణంగా తన కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడిందని మస్కిటో రిపెల్లెంట్స్‌ను కచ్చితంగా వాడాలని కాలుష్యం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని చెప్పింది. తనకు తెలిసిన వారు కూడా డెంగీ బారినపడ్డారనీ కంటికి కనిపించని ఓ వైరస్ పరిస్థితిని బాగా దిగజార్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపింది. ఇక ఆమె సినిమాల విషయాలకొస్తే.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘దమ్ లగా కే హైషా’ చిత్రంలో నటించినప్పటి నుండి బాలీవుడ్‌లో భూమి పెడ్నేకర్ ప్రయాణం మొదలైంది. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా మారింది. ఇటీవల విడుదలైన, ‘థాంక్యూ ఫర్ కమింగ్’, దేశీయ ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ది లేడీ కిల్లర్’ ఇటీవలే విడుదలై అభిమానులను అలరిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తున్న మరో చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.