Bengaluru: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.! హెల్ప్ అడిగినా పట్టించుకోని ప్రయాణికులు.!
ఐటీ సిటీ బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐటీ సిటీ బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు కాలేజ్‌కు రోజూ బస్సులో వెళతుందని, అయితే ఆమె నవంబర్ 20న మెట్రోలో ప్రయాణిందని చెప్పుకొచ్చారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్ స్టేషన్ మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాట జరిగిందని కొద్దిసేపటి తర్వాత, తన స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించిందని , ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నట్లు తెలిపారు. అతను ఆమెను అసభ్యకరంగా తాకడంతో పాటు గోర్లతో ఆమెను గుచ్చాడనీ దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసిందని అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదనీ ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘా ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా ఆయన సహాయం అందిస్తారని తెలిపారు,.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.