Andhra Pradesh: అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు.. సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..
ఏపీలో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీ పర్యటన కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. ఈనెల 27వరకూ వరల్డ్ బ్యాంకు, ADB ప్రతినిధుల విస్తృతంగా పర్యటిస్తారు.
అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధుల మంజూరుపై వరల్డ్ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి మరింత స్పష్టత దొరికింది. ఇవాళ చంద్రబాబు-ప్రపంచబ్యాంకు టీమ్స్ మధ్య కీలక భేటీ జరగగా.. వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన బృందాలు ఏపీకి వచ్చాయి. ఈ రెండు టీములూ ఈనెల 27వరకూ విస్తృతంగా పర్యటించబోతున్నాయి. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఉదయం సీఆర్డీఏ అధికారులతో చర్చించి.. మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబును కలిశారు.. ఈ సందర్భంగా వరల్డ్‌బ్యాంక్, ఆసియాబ్యాంక్ ప్రతినిధులు అనేక అంశాలపై చర్చించారు.
లీగల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి క్లారిఫికేషన్లు కూడా తీసుకుంది వరల్డ్ బ్యాంకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ టీమ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో ఉన్న లిటిగేషన్ల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌పై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. అమరావతి విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నామో.. అనే వివరాలను చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
బడ్జెట్లో ప్రతిపాదించిన 15 వేల కోట్లతో పాటు అదనంగా మరింత సాయం చేయడానిక్కూడా వరల్డ్‌బ్యాంక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌తో కలసి ఈ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశముంది. వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. మొత్తంగా సీఎంతో వరల్డ్‌బ్యాంకు ప్రతినిధుల భేటీ పాజిటివ్ మూడ్‌లోనే జరిగింది.
వీడియో చూడండి..
వారంరోజుల కిందట కూడా సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. అమరావతిలో నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ను, విట్, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌ను పరిశీలించారు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు. మొత్తంగా.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..