Macherla: పల్నాడులో టెన్షన్ టెన్షన్.. రణరంగంగా మాచర్ల.. కర్రలు, రాళ్లతో వీరంగం..

పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఎస్పీ రవిశంకర్ రెడ్డి రాత్రే మాచర్లకు...

Macherla: పల్నాడులో టెన్షన్ టెన్షన్.. రణరంగంగా మాచర్ల.. కర్రలు, రాళ్లతో వీరంగం..
Attacks In Macherla
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 17, 2022 | 6:56 AM

పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఎస్పీ రవిశంకర్ రెడ్డి రాత్రే మాచర్లకు చేరుకున్నారు. మరిన్ని దాడులు జరగకుండా పటిష్ఠ బందోబస్తు కాస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాచర్లలో 144 సెక్షన్ అమలు చేస్తుండగా.. పోలీసులు షాపులు మూయిస్తున్నాయి. కాగా.. మాచర్ల పట్ణం రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మరెడ్డి ఇంటికి నిప్పుబెట్టారు. దీంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయంత్రం ఆరు గంటలు దాటిన సమయంలో టీడీపీ ఇదేం ఖర్మ ప్రొగ్రాం చేపట్టింది. దానికి దీటుగా మరోవైపు జై పీఆర్కే అంటూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే స్థాయి నుంచి కర్రలు, రాడ్లతో దాడు చేసుకునే స్టేజ్ వరకు వెళ్లిపోయింది.

ఇరు పార్టీల దాడులతో మాచర్లలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. ప్రొగ్రాం నిలిపివేసిన పోలీసులు వెంటనే టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకొని గుంటూరు తరలించారు. దాడులతో ఆగకుండా దమనకాండ వరకు వెళ్లింది పరిస్థితి. బ్రహ్మారెడ్డి ఇంటితో పాటు మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు దుండగులు. వాహనాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సమయం రాత్రి 11గంటలైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ దాడులకు పాల్పడే వారిని చెదరగొట్టారు. పరిస్థితిని సర్థుమణిచారు.

మాచర్లలో జరిగిన గొడవలకు ఫ్యాక్షన్ మూలాలే కారణమని చెప్పారు ఎస్పీ. వెల్దుర్ధి మర్డర్ కేసులో ఉన్న ఫ్యాక్షన్ నాయకులు రాజకీయ పార్టీల ఆశ్రయం పొంది గొడవలకు పాల్పడ్డారని తెలిపారు ఎస్పీ. వెల్దుర్తి చుట్టూ ప్రక్కల గ్రామాలలో హత్యకేసులో ఉన్న ముద్దాయిలే మాచర్లకు వచ్చారని ఎస్పీ చెప్పారు. చంద్రబాబు ప్లాన్ బిలో భాగమే ఈ దాడులని చెప్పారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీనిపై నిజ నిర్థారణ కమిటీ వేసి.. రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోయిందని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తారని విమర్శించారు పిన్నెల్లి.

ఇవి కూడా చదవండి

మరోవైపు వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడిందని చెప్పారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. ముందస్తుగా సమాచారం ఇచ్చినా దాడులు అడ్డుకోవటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ దాడి ఘటనపై చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసుల సహకారంతో వైసీపీ మూకలు రెచ్చిపోయారంటూ విమర్శించారు. మాచర్లలో హింసపై గుంటూరు డీఐజీ కి చంద్రబాబు ఫోన్ చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..