Andhra Pradesh: మాచర్ల ఘటనపై డీఐజీకి చంద్రబాబు ఫోన్‌.. పోలీసుల తీరుపై..

మాచర్లలో చెలరేగిన ఉద్రికత్తత రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టీడీపీ, వైసీపీ గొడవలతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా టీడీపీ ఇంఛార్జ్.. బ్రహ్మారెడ్డి ఇంటికే నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. టీడీపీ శుక్రవారం నిర్వహించిన..

Andhra Pradesh: మాచర్ల ఘటనపై డీఐజీకి చంద్రబాబు ఫోన్‌.. పోలీసుల తీరుపై..
Chandra Babu Naidu
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 17, 2022 | 6:02 AM

మాచర్లలో చెలరేగిన ఉద్రికత్తత రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టీడీపీ, వైసీపీ గొడవలతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా టీడీపీ ఇంఛార్జ్.. బ్రహ్మారెడ్డి ఇంటికే నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. టీడీపీ శుక్రవారం నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఈ గొడవ చెలరేగింది. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మాచర్ల పరిస్థితులపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. ఈ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని ఫిర్యాదు చేశారు.

ఇక మాచర్లలో టీడీపీ శ్రేణులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాన్న చంద్రబాబు.. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం దారుణమన్నారు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుందన్నారు. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!