Andhra Pradesh: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. భీకరంగా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు..

పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య భీకర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

Andhra Pradesh: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. భీకరంగా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు..
Macharla Clashes
Follow us

| Edited By: Ganesh Mudavath

Updated on: Dec 17, 2022 | 6:19 AM

రాళ్లు గాల్లోకి ఎగిరాయ్.. కర్రలు పైకి లేచాయ్.. నిప్పులు చెలరేగాయి.. పల్నాడులో పొలిటికల్ పౌరుషాలతో.. మాచర్ల ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ గొడవలతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏకంగా టీడీపీ ఇంఛార్జ్.. బ్రహ్మారెడ్డి ఇంటికే నిప్పుపెట్టారు. మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు దుండగులు. వాహనాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు.

ఈ ఘర్షణపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మాచర్లలో YCP రౌడీ మూకలు రెచ్చిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. వైసీపీ అరాచక పాలనకు ఇదే నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై దాడులను ఖండించారు లోకేష్. అయితే టీడీపీ కావాలని గొడవ క్రియేట్ చేసిందని ఆరోపిస్తున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తమ కార్యకర్తలు సంయమనంతోనే ఉన్నారన్నారు. అక్కసుతోనే టీడీపీ గొడవలు సృష్టించారని అంటున్నారు పిన్నెల్లి.

తీవ్ర ఘర్షణల నేపథ్యంలో మాచర్లలో భారీగా మోహరించారు పోలీసులు. అల్లరిమూకలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ప్రస్తుతానికి బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి తరలించారు.

ఇవి కూడా చదవండి

టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమంలో గొడవ చెలరేగింది. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు టీడీపీ నేత బ్రహ్మారెడ్డిపై లాఠీ ఎత్తారంటూ పోలీసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు అడ్డుకోలేదంటూ మండిపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..