AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: విభజన తర్వాత విజన్‌ 2029 రూపొందించా.. హైదరాబాద్‌లో ISB 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు

అప్పుడు విజన్‌ 2020- ఇప్పుడు 2029 విజన్‌తో ముందుకెళ్తున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో ISB ఏర్పాటు కృషిని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Chandrababu: విభజన తర్వాత విజన్‌ 2029 రూపొందించా.. హైదరాబాద్‌లో ISB 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు
Chandrababu
Sanjay Kasula
|

Updated on: Dec 16, 2022 | 9:22 PM

Share

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమంలో మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటైన ఐఎస్‌బీ ఇవాళ మహావృక్షంగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐఎస్‌బీ వ్యవస్థాపక డీన్ ప్రమాత్ రాజ్ సిన్హా తో చంద్రబాబు కన్వర్జేషన్ జరిగింది. ఇందులో ఇద్దరు ఐఎస్‌బీ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు గుర్తు చేసుకున్నారు. అమెరికా వెళ్లి అనేకమంది అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈవోలను కలిసి..మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని అప్పట్లో బతిమాలుకున్నామని చెప్పారు. వేరే రాష్ట్రాలకు ఐఎస్‌బీ వెళ్తుందన్న సమయంలో హైదరాబాద్ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారో వెల్లడించారు. 20 ఏళ్ల కిందట సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటే ఉన్న గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎన్ని కొత్త సంస్థలు వచ్చాయో ఎంత అభివృద్ధి జరిగింది చూడాలన్నారు. ముందుచూపుతో విజన్ 2020 అంటే హేళన చేశారని.. ఇప్పుడు అదే పునాదులపై హైదరాబద్ మరింత డెవలప్ అవుతుందని అన్నారు. హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపి కోసం విజన్ 2029 రూపొందించామని.. హైదరాబాద్ ఇంప్రూవ్డ్ సిటీగా అమరావతిని నిర్మించాలని అనుకున్నట్లు చెప్పారు. ఏపి విడిపోయిన తర్వాత గ్రోత్ రెట్ 10.8 తీసుకుపోయన్న చంద్రబాబు, ఇప్పుడు గ్రోత్ రెట్ 3.5 కి పడిపోయినట్లు చెప్పారు. ఇప్పుడున్న తరం తప్పు చేస్తే వచ్చే తరం తీవ్రంగా నష్టపోతుంద నీ అన్నారు. అమరావతి డెవలప్ మెంట్ అగిపోవడంపై బాధను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జంటలు ఇద్దరు పిల్లల్ని కనాలనీ..25 ఏళ్ల తర్వాత యువత దీగ్రెడ్ లో ఉండొద్దని అభిప్రాయపడ్డారు. ISB 2047 నాటికి ప్రపంచంలోనే టాప్-3 లో ఉండాలని సూచించారు.

మన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం