Big News Big Debate: మరోసారి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విభజన వ్యవహారం.. మాటల మంటలు..!

Big News Big Debate: మరోసారి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విభజన వ్యవహారం.. మాటల మంటలు..!

Anil kumar poka

|

Updated on: Dec 16, 2022 | 7:35 PM

ఎక్కడో రాజమండ్రిలో పుట్టిన సెంటిమెంట్‌ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలను దహించివేస్తోంది. ఇందులో రాజకీయం ఎంతవరకూ పిండుకొవచ్చా అని పార్టీలు కూడా దూరి మరీ తమవంతు చిచ్చు రాజేస్తున్నాయి.


ఎక్కడో రాజమండ్రిలో పుట్టిన సెంటిమెంట్‌ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలను దహించివేస్తోంది. ఇందులో రాజకీయం ఎంతవరకూ పిండుకొవచ్చా అని పార్టీలు కూడా దూరి మరీ తమవంతు చిచ్చు రాజేస్తున్నాయి. విభజన అడ్డగోలుగా జరిగిందని చట్టబద్దంగా లేదని మాజీ ఎంపీ ఉండవల్లి వేసిన కేసు సుప్రీంలో విచారణకు రావడంతో రాజుకున్న సెంటిమెంట్ అగ్గి.. తాజాగా తెలంగాణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌తో మంటలై ఎగిసిపడుతోంది.రాష్ట్ర విభజనపై ఏపీ ప్రభుత్వం వాదన ఏంటని ఉండవల్లి ప్రశ్నిస్తే రెండు రాష్ట్రాలు కలుస్తాయంటే ముందుగా స్వాగతించేది తామే అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. తెలంగాణ నుంచి జెట్‌ స్పీడులో రియాక్షన్స్‌ కూడా వచ్చాయి. సమైక్య కుట్రలకు తెరతీశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.అయితే రెండు రాష్ట్రాల మఖ్యమంత్రులు మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే మళ్లీ సెంటిమెంట్‌ రాజేస్తున్నారని ఆరోపించాయి కొన్ని పార్టీలు. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ కూడా కేసీఆర్‌, జగన్‌లను టార్గెట్‌ చేశాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి అటెన్షన్‌ వచ్చేలా చేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 07:35 PM