Andhra Pradesh: నా మరణదిన వేడుకలకు హాజరుకండి.. ఆశీర్వదించండి.. ఏపీ మాజీ మంత్రి వినూత్న ఆహ్వాన లేఖ..

మీ అందరికీ నా మరణ దిన వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నాను.. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్ధం లేదని, మరణ దినోత్సవ వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాను.. నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను..

Andhra Pradesh: నా మరణదిన వేడుకలకు హాజరుకండి.. ఆశీర్వదించండి.. ఏపీ మాజీ మంత్రి వినూత్న ఆహ్వాన లేఖ..
Paleti Ramarao
Follow us

|

Updated on: Dec 17, 2022 | 8:09 AM

‘‘మీ అందరికీ నా మరణ దిన వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నాను.. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్ధం లేదని, మరణ దినోత్సవ వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాను.. నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను.. నేను మరణించే సమయం ఇంకా 12 ఏళ్ళు ఉంది. అందువల్ల ఈరోజు నుంచే 12వ మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. కావున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి’’.. ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. ఇలా తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులను పంపించారు. ప్రస్తుతం ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.

భగవంతుడు ఎంత బోధించినా మానవుడు తన జీవన గమనాన్ని ఆలోచనా విధానాన్ని పూర్తిగా సరి చేసుకొనలేక పోతున్నాడని మాజీ మంత్రి పాలేటి రామారావు అభిప్రాయం.. పరులకు అపకారం జరిగే పనులను ఆపుకోలేక పోతున్నామని, దేవుళ్ళందరూ మానవుడు తప్పక మరణిస్తాడని, జీవించి ఉన్న కాలంలో పరులకు అపకారం చేయకుండా, ఉపకారం మాత్రమే చేయమని నేర్పించారని చెబుతున్నారు.. మానవుడు ఒక జీవి దశ నుండి మనిషి దశలోకి మారాలన్నది భగవంతుల ఆశ్చ జీవిగా ఉన్నంత కాలం తను బతికితే చాలనుకుంటాడు. మానవుడు తనెంత కాలం జీవించాలనుకుంటున్నాడో తనే ఆలోచించుకొని, తన మరణ సంఘటనకు ఒక తారీఖును నిర్ణయించుకోగలగాలని కోరుతున్నారు.. తాను ఖచ్చితంగా మరణిస్తానని గ్రహించి ఇంత కాలం జీవించాం కాబట్టి, ఇంకెంత కాలం జీవిస్తామో లెక్క వేయాలని సూచించారు. కొద్ది కాలమే జీవిస్తానని తెలుసుకున్న తరువాత భగవంతుడు నేర్పించిన విధంగా జీవి దశ నుండి మనిషి దశ లోనికి మారే ప్రయత్నం చేయాలన్నారు.. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తొలి ప్రయత్నంగా. తాను ఎంత కాలం జీవించాలనుకుంటున్నానో ఆలోచించి, మరణానికి ఒక తారీఖును.. అది 2034గా నిర్ణయించానని పాలేటి రామారావు ఆహ్వాన లేఖలో తెలిపారు.

1959లో పుట్టిన తాను ఇప్పటికి ఎంతకాలం జీవించానో తెలిసి, ఇంకెంత కాలం మిగిలివున్నదో లెక్కించానని పాలేటి రామారావు తెలిపారు. తాను ఇంకా 12 ఏళ్లు జీవించాలని భావిస్తున్నందున ఈరోజు 12వ మరణదినాన్ని జరుపుకుంటున్నానని, అభిమానులు వచ్చి ఆశీర్వదించాలని కోరారు. తాను 75 సంవత్సరములు జీవిస్తానని కోరుకుంటున్నాని, ప్రస్తుతం 63 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా 12 సంవత్సరాలు జీవించాలి కావున ఈరోజు 12వ మరణ దినాన్ని జరుపుకోవాలని ఏర్పాట్లు చేసినట్టు పాలేటి రామారావు తెలిపారు. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు.

ఇవి కూడా చదవండి

మంత్రిగా.. 

కాగా.. పాలేటి రామారావు చీరాల మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు గెలుపొందారు. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచి ఎన్టీఆర్ కెబినేట్ లో మంత్రి పదవి చేపట్టారు. 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. 2004లో తిరిగి రోశయ్యపై ఓడి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ కొద్దికాలానికే వైసీపీ గూటికి చేరుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..