AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సమగ్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌.. డీపీఐఐటీ నివేదిక వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు..

Andhra Pradesh: సమగ్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌.. డీపీఐఐటీ నివేదిక వెల్లడి
Andhra Pradesh
Subhash Goud
|

Updated on: Sep 30, 2022 | 4:47 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఇక అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు. 2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే రూ.40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. దేశంలో రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది.

అయితే 2021-22లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటులో ఏపీనే నెంబర్‌ వన్‌గా నిలిచినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. అదే సమయంలో ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతం కావడం విశేషం. వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది.

అయితే సంక్షేమంలోనే ఇప్పటికే అనేక రికార్డులను సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. మరో వైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. డీపీఐఐటీ రూపొందించిన నివేదిక ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దేశంలో గడిచిన ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏ రాష్ట్రం సాధించనన్ని పెట్టుబడులను రాబట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఏపీ తర్వాత ఒడిశా రాష్ట్రం నిలిచింది. దేశం మొత్తం మీద గత ఏడు నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45 శాతం వరకు పెట్టుబడులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఎంఓయూలను పెట్టుబడులుగా మలచడంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇవలన్నీ కూడా సీఎం జగన్‌ మూడుళ్ల పాలనా సంస్కరణలు, నిర్ణయాల వల్లనే ఇది సాధ్యమైనట్లు వెల్లడించింది. ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ గత ఏడు నెలల్లో అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది.

కొద్ది రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఏపీ ప్రభుత్వం లక్షా 26 వేల 748 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు, ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రాబోయే ఏడేళ్లలో 40 వేల 330 ఉద్యోగాలు రానున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి