Political War: డిప్యూటీ అయ్యారుగా.. మేమెక్కడ కనిపిస్తాం.. కేడర్ నిష్టూరాలు. .డైలమాలో రాజన్న దొర..

ఇన్నాళ్లూ పదవి రాలేదని ఒక బాధ. ఇప్పుడు పదవి వచ్చాక మరో బాధ. ప్రొటోకాల్ వ్యథ. ఇంతకీ ఎవరా లీడర్. క్యాడర్ నుంచి వెల్లువెత్తుతున్న అసంతృప్తులేంటి? గతానికీ వర్తమానానికీ మధ్య నలిగిపోతున్న.. ఆ ఉప ముఖ్యమంత్రి వర్యులెవరు? ఈ అపాయం నుంచి బయట పడే ఉపాయమేంటి..?

Political War: డిప్యూటీ అయ్యారుగా.. మేమెక్కడ కనిపిస్తాం.. కేడర్ నిష్టూరాలు. .డైలమాలో రాజన్న దొర..
Deputy Cm Rajanna Dora
Follow us

|

Updated on: Sep 30, 2022 | 9:13 PM

పీడిక రాజన్న దొర.. పార్వతీపురం- మన్యం జిల్లా, సాలూరు నుంచి నాలుగు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. గిరిజన శాఖలో సాధారణ ఉద్యోగిగా మొదలై.. ఇప్పుడేకంగా అదే శాఖకు మంత్రయ్యి.. చరిత్ర సృష్టించిన నాయకుడు. ఇక్కడ టీడీపీ గట్టిగా ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, ఎక్స్ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మధ్య ఆధిపత్య పోరున్నా.. దాన్ని కూడా తనకు అనువుగా మార్చుకుని.. గట్టెక్కెస్తున్నారు రాజన్న. దీంతో ఒకటికి నాలుగు సార్లు.. గెలుపు సాధించారు రాజన్న. ముక్కుసూటి మనిషిగా పేరున్న రాజన్న దొర సక్సెస్ సీక్రెట్ .. జనానికి వీలైనంత దగ్గరగా ఉండటం. కార్యకర్తలు, అనుచరుల కోసం పనులు చేయడంలో దిట్టగా పేరు సాధించడం. తన ఇంటికి ఎవరొచ్చినా.. వారందరికీ అందుబాటులో ఉంటూ.. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఎలాంటి భేషజాల్లేకుండా వెళ్తూ.. కేడర్ మెచ్చిన లీడర్ గా పేరు సాధించారు రాజన్న దొర. దీంతో ఇన్నాళ్ల పాటు రాజన్న దొర గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే తొలి మంత్రి వర్గ విస్తరణలోనే రాజన్నకు పదవి ఖాయమని భావించారంతా. కానీ అభిమానుల ఆశలు అడియాశలే అయ్యాయి. పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి దక్కింది. తర్వాత రెండో మంత్రి వర్గ విస్తరణలో పదవి వస్తుందో రాదో? టెన్షన్ టెన్షన్. నాలుగు సార్లు గెలిచినా? మంత్రి పదవి అందని ద్రాక్షేనా? అన్న నిరుత్సాహం. మనకంత లక్కు లేదేమో అంటూ కార్యకర్తల దగ్గర వాపోయేవారు కూడా. అయితే అధిష్టానం ఆశీస్సులతో రెండో మంత్రి వర్గ విస్తరణలో రాజన్న దొరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి లభించింది. దీనికి బోనస్ గా డిప్యూటీ సీఎం పదవి కూడా వరించింది. పదవి వస్తుందో రాదో అన్న డైలమాలో ఉన్న రాజన్న ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

ఇక్కడి వరకూ ఓకే. తర్వాత ఓ కొత్త సమస్య వచ్చి మీద పడింది. రాజన్న దొర డిప్యూటీ సీఎం కూడా కావడంతో ప్రొటోకాల్ పెరిగింది. ఇదే రాజన్నను అభిమానులకు దూరం చేస్తోంది. అందునా సాలూరు ఏజెన్సీ ప్రాంతం, దానికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కూడా కావడంతో.. సాలూరు నుంచి ఎటెళ్లాలన్నా పోలీస్ పర్మిషన్ కంపల్సరీ. దీంతో రాజన్న ఎటూ కదల్లేక పోతున్నారట. గతంలో చిన్నా చితకా కార్యక్రమాలకు కూడా కొండలు, గుట్టలు దాటుకుని వెళ్లిపోయేవారు. అభిమానులను ఆనందంలో ముంచెత్తేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పోలీసులు ఆంక్షల విధింపుతో కార్యకర్తలు పిలిచే కార్యక్రమాలకు వెళ్లలేక పోతున్నారట. ఒకప్పుడు ఇలా పిలిస్తే అలా వాలిపోయిన రాజన్న దొరేటి? ఈ మద్దెన మన పిలుపులకు పలకడం లేదేటి? అన్న అసహనం వ్యక్తం చేస్తున్నారట సాధారణ కార్యకర్తలు.

సాలూరు లో రాజన్నకు ఒకప్పటి అభిమానం ఇప్పుడు లేదట. డిప్యూటీ అయ్యాడు గందా.. మేమెందుకు కనిపిత్తాంలే.. అంటూ నేరుగానే నిష్టూరాలాడుతున్నారట. ఇక గ్రామ స్థాయిలో మా రాజకీయాలు పారే దారేది? అంటూ విలేజ్ లెవల్ కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దానికి తోడు పోలీసులు కూడా గతంలో స్పందించినట్టు ఇప్పుడు రియాక్ట్ కావడం లేదట. కేడర్ కి సంబంధించి ఏదైనా పని చెబితే.. లైట్ తీస్కో అంటున్నారట. ఇటు కార్యకర్తల దగ్గరకు తాను వెళ్లలేక.. అటు దూరం నుంచైనా వాళ్ల పనులు చేద్దారంటే.. దగ్గరి దారి దొరక్క.. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట.. ఉపముఖ్యమంత్రి రాజన్న దొర. ఈ ఉప అపాయం నుంచి గట్టెక్కే ఉపాయమేంటో తెలీక అల్లాడిపోతున్నారట.

ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త సమస్య కూడా తోడవడంతో మరింత ఇరకాటంలో పడ్డారట రాజన్న దొర. ఇన్నాళ్లూ ఏ అవినీతి మరక లేకుండా నెట్టుకొస్తున్న దొరకు కొత్త మరక అంటుకుంటోందట. రాజన్న దొర సిబ్బంది, అనుచరుల రూపంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. రాజన్న దగ్గర కీలకంగా ఉన్న ఒక అధికారి.. ఏ పని కావాలన్నా ఎంతో కొంత ముట్ట చెప్పాలంటున్నారట. కొందరు అనుచరులు రాజన్న పేరు చెప్పి పైరవీలు, రియల్ దందా చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా రాజన్న దొరకు రాన్రాను కొత్త సమస్యలొచ్చి మీద పడుతుండటంతో.. ఏం చేయాలో పాలు పోవడం లేదట. ఈ గ్యాప్ లో టీడీపీ లీడర్లు భంజ్ దేవ్, గుమ్మడి సంధ్యారాణి గ్రూపులు పక్కన పెట్టి.. బాదుడే బాదుడు కార్యక్రమం చురుగ్గా నిర్వహిస్తున్నారట. ఇప్పటికే ఇంటా బయటా ఉన్న వ్యతిరేక పరిస్థితుల నుంచి గట్టెక్కే దారేదన్న డైలమాలో పడ్డారట రాజన్న. మరి వీటన్నిటి నుంచి బయట పడి రాజన్న పేరుకు తగ్గట్టు దొర దొరే.. అనిపించుకుంటారా? ఈ దిన దిన డిప్యూటీ గండం నుంచి బయట పడతారా? తేలాల్సి ఉంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు