AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రబాబు కరకట్ట నివాసం జప్తుపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే?

చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని.. మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసింది సీఐడీ.

Andhra Pradesh: చంద్రబాబు కరకట్ట నివాసం జప్తుపై ఏసీబీ కోర్టులో ముగిసిన  వాదనలు.. తీర్పు ఎప్పుడంటే?
Chandrababu Naidu
Basha Shek
|

Updated on: May 31, 2023 | 9:27 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పు జూన్ 2కి వాయిదా వేశారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని.. మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసింది సీఐడీ. ఏపీ సీఐడీ తరఫున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామన్నారు సీఐడీ తరఫు న్యాయవాది. అందులో లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటైతే.. మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్‌ మరొకటన్నారు. 1944 ఆర్డినెన్స్‌ ప్రకారం పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరామన్నారు.

చంద్రబాబు, నారాయణతో పాటుగా మరి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. తమ సొంత లాభం కోసం వాస్తవాలు దాచారని సీఐడీ నివేదికలో పేర్కొంది. చట్టాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని వివరించింది. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా నేరపూరితమైన కుట్రతో మార్పులకు ఆమోదముద్ర వేశారని పేర్కొంది. లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా చాలా మలుపులు తీసుకుంది. ఇక జూన్‌ 2న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..