Andhra Pradesh: అయ్యో ఏంటీ ఈ ఘోరం.. అప్పుడే పుట్టిన శిశువుని సంచిలో కట్టి వదిలి వెళ్లిన తల్లి
అప్పుడే పుట్టిన శిశువులను ఎక్కడో ఓ చోట వదిలేసి వెళ్లిపోవడం, చెత్తకుప్పలో వేసేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఓ మాతృమూర్తి తనకు పుట్టిన మగ శిశువును సంచిలో కట్టి వదిలిపెట్టి వెళ్లడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణానికి వచ్చిన ఓ తల్లి తనకి అప్పుడే పుట్టిన ఓ మగశిశువును సంచిలో కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు శిశువు ఏడుపును విన్నారు. వెంటనే ఆ శిశువును కాపాడి గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్యులు ఆ చిన్నారికి ప్రథమ చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఆ శిశువును అలా వదిలివెళ్లేసిన వారు ఎవరూ.. ఎందుకు అలా చేశారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..