5

Andhra Pradesh: ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం.. గురువారం ఉదయం సీఎస్‌తో కీలక సమావేశం

సమస్యల పరిష్కారం కోసం గత కొంతకాలంగా ఉద్యమ బాటపట్టిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. రేపు (గురువారం) ఉదయం ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్‌ జవహర్‌ రెడ్డి చర్చలు జరుపుతారు. ఏపీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది ఏపీ జేఏసీ అమరావతి.

Andhra Pradesh: ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం.. గురువారం ఉదయం సీఎస్‌తో కీలక సమావేశం
AP Govt
Follow us

|

Updated on: May 31, 2023 | 9:58 PM

సమస్యల పరిష్కారం కోసం గత కొంతకాలంగా ఉద్యమ బాటపట్టిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. రేపు (గురువారం) ఉదయం ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్‌ జవహర్‌ రెడ్డి చర్చలు జరుపుతారు. ఏపీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది ఏపీ జేఏసీ అమరావతి. అందులో భాగంగానే ఏపి జెఏసి రాష్ట్రకమిటీ తరఫున ఫిభ్రవరి 13 న చీఫ్‌ సెక్రటరీకి 50 పేజీల మెమోరాండం సమర్పించింది. అవే అంశాలపై ఉద్యోగ జేఏసీ నేతలతో గురువారం సీఎస్‌ చర్చించనున్నారు.మరోవైపు గత 84 రోజులుగా సాగుతోన్న ఉద్యమం మూడో దశకు చేరుకుంది. తమ పోరాటం కొనసాగింపులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది ఏపీ జేఏసీ అమరావతి. మరోవైపు గుంటూరులో జూన్ 8న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు.

ఇక తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 84 రోజులుగా ఉద్యమిస్తున్నామని బొప్పరాజు వెల్లడించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని బొప్పరాజు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు వెల్లడించారు. జూన్ 10లోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
సీఎం కేసీఆర్ ఆశయం.. నెరవేరనున్న సిద్దిపేట వాసుల దశాబ్ధాల కల
సీఎం కేసీఆర్ ఆశయం.. నెరవేరనున్న సిద్దిపేట వాసుల దశాబ్ధాల కల
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..
కళ్లన్నీ సుప్రీం పైనే.. ఇవాళ ఏం జరగనుంది..?
కళ్లన్నీ సుప్రీం పైనే.. ఇవాళ ఏం జరగనుంది..?
40 రూపాయ‌లు అప్పు చేసిన గొర్రెల కాపరి.. అంతలోనే కోటీశ్వరుడయ్యాడు.
40 రూపాయ‌లు అప్పు చేసిన గొర్రెల కాపరి.. అంతలోనే కోటీశ్వరుడయ్యాడు.
సోషల్ మీడియాలో అందాల భామల హంగామా..
సోషల్ మీడియాలో అందాల భామల హంగామా..
ప్రార్థన చేస్తున్న సమయంలో చర్చి పైకప్పు కూలి 11 మంది మృతి
ప్రార్థన చేస్తున్న సమయంలో చర్చి పైకప్పు కూలి 11 మంది మృతి
సెంచరీతో చెలరేగిన యశస్వీ.. నేపాల్ ముందు భారీ టార్గెట్..!
సెంచరీతో చెలరేగిన యశస్వీ.. నేపాల్ ముందు భారీ టార్గెట్..!
బండారు సత్యనారాయణపై 7 సెక్షన్ల కింద కేసు.. ఇవాళ కోర్టులో విచారణ
బండారు సత్యనారాయణపై 7 సెక్షన్ల కింద కేసు.. ఇవాళ కోర్టులో విచారణ