Andhra Pradesh: ఆమ్యామ్యా తీసుకుంటూ.. అడ్డంగా బుక్కైన ఆఫీసర్! మాస్టర్ ప్లాన్ వేసినా ఫలించని లంచం మంత్రం..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా డీఎఫ్ఓ రాజారావు సహా ముగ్గురుని పట్టుకున్నారు. టేకు చెట్ల పర్మిషన్ కోసం వచ్చిన తన వద్ద లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అటవీ అధికారి బి. రాజారావు పై వచ్చిన ఫిర్యాదుతో..

అనకాపల్లి, నవంబర్ 14: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా డీఎఫ్ఓ రాజారావు సహా ముగ్గురుని పట్టుకున్నారు. టేకు చెట్ల పర్మిషన్ కోసం వచ్చిన తన వద్ద లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అటవీ అధికారి బి. రాజారావు పై వచ్చిన ఫిర్యాదుతో అనకాపల్లి జిల్లా అటవీ కార్యాలయం పై ACB అధికారులు దాడులు నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా, నర్సిపట్నం మండలం బొడ్డేపల్లి కి చెందిన బాలిరెడ్డి ఈశ్వర రావుకి చెందిన 130 టేకు చెట్లు రవాణా కోసం పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు 280 చెట్లు నరకడానికి, 150 చెట్లు రవాణా కోసం అనుమతి ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు కోరాడు. దీంతో.. అనుమతి ఇవ్వాలంటే 60,500 రూపాయలు లంచం ఇవ్వాలని డి.ఎఫ్.ఒ రాజారావు డిమాండ్ చేశారు. దీంతో బాదితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు నర్సీపట్నంలోని అనకాపల్లి జిల్లా అటవీ కార్యాలయంపై నిఘాపెట్టారు.
అయితే.. జిల్లా అటవీ అధికారి రాజారావు ఆదేశాలతో నర్సీపట్నం ఎఫ్‌ఆర్‌ఓ రైటర్ నారాయణమూర్తి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ ద్వారా అడ్వాన్స్ గా 50వేలు బాధితుడు నుంచి లంచం చూసుకుంటున్నారు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా అటవీ సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డి.ఎఫ్.ఒ రాజారావు సహా ముగ్గురిని రైటర్లను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




