5

Andhra Pradesh: అనారోగ్యంతో మృతి చెందిన భర్త.. ఇంట్లోనే అట్టపెట్టలతో దహనసంస్కారాలు చేసిన భార్య

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది ఓ భార్య. అలా అనీ వాళ్లది చదువులేని కుటుంబమా అంటే అదీ కాదు.. సమాజంలో మంచి పేరున్న కుటుంబమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి..

Andhra Pradesh: అనారోగ్యంతో మృతి చెందిన భర్త.. ఇంట్లోనే అట్టపెట్టలతో దహనసంస్కారాలు చేసిన భార్య
Representative Image
Follow us

|

Updated on: May 29, 2023 | 2:54 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది ఓ భార్య. అలా అనీ వాళ్లది చదువులేని కుటుంబమా అంటే అదీ కాదు.. సమాజంలో మంచి పేరున్న కుటుంబమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌, లలిత భార్యాభర్తలు జీవినం సాగిస్తున్నారు. హరికృష్ణ ప్రసాద్‌ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు.

అయితే ఇదే సమయంలో ఈరోజు ఉదయం హరికృష్ణ ప్రసాద్‌ ఇంటి పొగలు రావడాన్ని కాలనీ వాసులు గుర్తించారు. అంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లలితను విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. తన భర్త సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడని, కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

అలాగే కుమారులిద్దరూ ఆస్తి కొసమే తమ వద్దకు వస్తున్నారని, తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారనే భయంతోనే తాను భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు తెలిపింది. దీంతో దీని విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రేమ జంటకు అండగా పోలీసులు.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్
ప్రేమ జంటకు అండగా పోలీసులు.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్
ఈ నవరాత్రిలో శక్తిపీఠాలను సందర్శించండి.. మీ కోరికలు నెరవేరుతాయి
ఈ నవరాత్రిలో శక్తిపీఠాలను సందర్శించండి.. మీ కోరికలు నెరవేరుతాయి
సోమిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని.. ఎందుకంటే..
సోమిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని.. ఎందుకంటే..
న్యూయార్క్ జూ నుంచి వణ్యప్రాణులు తప్పించుకున్నాయా..?
న్యూయార్క్ జూ నుంచి వణ్యప్రాణులు తప్పించుకున్నాయా..?
మైఖేల్ ని పోలీసులకు పట్టించిన కావ్య, రాజ్ లు.. షాక్ లో రుద్రాణి,
మైఖేల్ ని పోలీసులకు పట్టించిన కావ్య, రాజ్ లు.. షాక్ లో రుద్రాణి,
బెంగుళూరులో ప్రెస్‏మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్ రియాక్షన్..
బెంగుళూరులో ప్రెస్‏మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్ రియాక్షన్..
విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు.. హరితేజ రియాక్షన్‌ ఏంటంటే?
విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు.. హరితేజ రియాక్షన్‌ ఏంటంటే?
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్షాలు..
అందుకే బాబు జైలుకెళ్లారు.. సజ్జల సంచలన కామెంట్స్..
అందుకే బాబు జైలుకెళ్లారు.. సజ్జల సంచలన కామెంట్స్..
రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన రతిక, అమర్ దీప్. మానసికంగా దాడి
రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన రతిక, అమర్ దీప్. మానసికంగా దాడి