Balayya: పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో బాలయ్య ప్రత్యేక పూజలు.. మోక్షు ఎంట్రీ కోసమేనా..?
-- బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా..! బాలయ్య సినిమాలో ఆయన చిన్నప్పటి క్యారెక్టర్ చేయబోతున్నారా..? తాజాగా కోనసీమ జిల్లాకు వెళ్లి బాలకృష్ణ పూజలు చేయడంతో ఇలాంటి చర్చే జరుగుతోంది. తనయుడి తెరంగేట్రానికి బాలకృష్ణ అంతా సిద్ధం చేసినట్టుగానే కనిపిస్తోందని సన్నిహితులు అంటున్నారు.
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటికుర్రులో శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో బాలయ్య రెగ్యులర్‌గా పూజలు చేస్తుంటారు. ఆయన ఆధ్యాత్మిక గురువు నాగమల్లేశ్వర సిద్ధాంతి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సోమవారం ఆ ఊరు వెళ్లిన సందర్భంగా ఆలయంలో మళ్లీ పూజలు చేశారు. తర్వాత అభిమానులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.
గతంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ ఇదే గుడిలో పూజలు చేశారు. మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరోసారి బాలయ్య అక్కడికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో NBK-108 షూటింగ్‌లో బాలయ్య బిజిగా ఉన్నారు. ఆ తర్వాత బోయపాటి- బాలయ్య కాంబినేషన్‌లో NBK-109 మొదలవుతుంది. పూర్తి రాజకీయ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చిన్నప్పటి బాలయ్య క్యారెక్టర్ మోక్షజ్ఞ చేస్తారంటూ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఓ వార్త బలంగా వినిపిస్తోంది. వీటికి బలం చేకూర్చేలా ఇప్పుడు బాలయ్య సెంటిమెంట్‌గా భావించే ఆలయంలో పూజలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..