AP Finance Meeting: కేంద్ర ప్రత్యేక కమిటితో రాష్ట్ర ప్రతినిధుల బృందం భేటీ.. ఏపీ పెండింగ్ నిధులు, సమస్యలపై కీలక చర్చ
AP Finance Meeting: ఏపీకి సంబంధించిన పెండింగ్ నిధులు, సమస్యలపై కీలక చర్చ జరిగింది. పోలవరం, భోగాపురం పోర్ట్ సహా అనేక అంశాలపై కేంద్రం నుంచి సానుకూల..
AP Finance Meeting: ఏపీకి సంబంధించిన పెండింగ్ నిధులు, సమస్యలపై కీలక చర్చ జరిగింది. పోలవరం, భోగాపురం పోర్ట్ సహా అనేక అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోంది. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో రాష్ట్ర ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఇటీవల ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు క్లియరెన్స్ గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగింది.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టుకు లైన్‌క్లియర్‌పై చర్చించామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను.. ఇప్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన రుణాల విషయంలో.. తెలంగాణ వాటా గురించి కూడా చర్చ జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం అవివేక నిర్ణయమే కారణమన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. దాన్ని సరిదిద్దడానికి ఇంత సమయం పట్టిందన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి